Thursday, September 20, 2018

అనాధలు

19-09-2018
శీర్షిక : అసలైన అనాథలు 
సంఖ్య : 60

స్వార్థాలు సరంగులై సమ పాళ్ళు తప్పి 
అధికార దాహాలు విషనాగులై విజృంభించ 
విపరీత రాజకీయాలు రాజ్యాలేలితే ..... 
ఆటవిక ఆచారాలకు ఆలంభనవదా .... 

చట్టాలను చుట్టలుగా మారుస్తూ .... 
అక్షరాస్యతలను, ఆరోగ్యాలను విస్మరించి  
మత్తులపై పన్నులతో పబ్బం గడిపే 
పాలకుల పాకులాటలో యాంత్రికత పెరిగి 
యాతన జీవులు ఉద్భవించారా ....... 

చిత్తు కాగితాల చెత్తకుప్పల్లో
కాలి బాటల కబంధ హస్తాల్లో 
రోడ్ల పక్కన ముళ్ల పొదల్లో 
కాళ్ల కడ్డం పడుతూ లేస్తూ .... 
కక్షలు పెంచుకోరా కఠినాలపై....

కాల చక్రంలో ఇదే కొనసాగితే 
కంటిపై కునుకు పట్టనీయని 
దేశద్రోహాలకు ........ 
కరుడు కట్టిన ఉగ్రవాదాలకు 
కేంద్రమవదా .....  

సంఘ జీవనములో సంచరిస్తూ నే 
సంస్కారాలు,సంప్రదాయాలు,సచ్చరితలు  మరిచి 
సమాజానికి కంటకమై, ఆటంకమై 
స్వార్ధానికి మాత్రమే ప్రాధాన్యమిచ్చి 
సత్మానవత  సమర్దించని వాడు, సృశించని వాడు 
అసలు సిసలైన అనాథ 

అక్షరాస్యత ఆలంబనైతే 
బతుకు విలువలు బాగుంటాయి. 
అందుకు ఆపన్నులవ్వాలి  
రాజకీయులు, అధికారులు,
ప్రజలు, స్వచ్చంద సంస్థలు ప్రతీవారు.... 


No comments:

Post a Comment