22-09-2018
శీర్షిక : సర్వాంతర్వాహిని
సంఖ్య :63
ఎవరు నేర్పారని !
చరా చర విశ్వం లోని ప్రతి అణువు
ప్రగతి శీలంగా ప్రతి నిత్యం మారుతూ
కొత్త పుంతలు తొక్కుతూనే ఉంది.
ఎవరు నేర్పారని !
పవిత్రమైన పంచ భూతముల
సమ్మిళితమైన కాలాలు
ఎవరు అవునన్నా , ఎవరు కాదన్నా
ప్రణాళికా బద్దంగా, కాలానుగుణంగా
పరివర్తన చెందుతూ మానవ కళ్యాణం లో
ముఖ్య భూమికను పోషిస్తూనే ఉన్నవి .
పక్షిరాజైన గ్రద్ద 70 ఏండ్లు బతకడానికి
తన నాసికాన్ని, రెక్కలను తెగ నరుక్కుని
కొత్త జీవితానికి ద్వారాలు తీసుకుంటుంది.
నిజానికి చైతన్యం సర్వకాల, సర్వావస్థల,
సర్వాంతర్వాహిని.
ప్రతి చోట, ప్రతి క్షణం, ప్రతి దానిలో......
నిగూఢమై,నిక్షిప్తమై నిలిచినది.
మరెందుకో ?
సకల ప్రాణకోటిలో మిన్న అని,
అన్నిటిని ఆజమాయిషీ చేయగలిగేది
మానవుడే అని విర్రవీగే మనకు మాత్రం
'మార్పు' లోని గొప్పతనాన్నిగుర్తించక గుర్రు
పెట్టి నిద్ర పోతే ప్రతీ క్షణం, ప్రతీ నిమిషం,
ప్రతీ రోజు ఎవరో ఒకరు తట్టి కదపాలి,లేపాలి.
చైతన్యం గురించి చెప్పాలి.చైతన్యం బోధించాలి?
నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)
No comments:
Post a Comment