నగునూరి రాజన్న
అంశం : సంయమనం
తేది: 20-09-2018
శీర్షిక :
సంఖ్య : 61
మన సంస్కృతి, సాంప్రదాయాలు
వేదపురాణేతిహాసాలు, భారత, రామాయణాలు
వల్లె వేసిన జాతి పిత వల్లించెను పదే పదే....
శాంతి, అహింస,సంయమనమే అంతిమ విజయమని.
మితవాదం అతివాదం అనేకవాదాల
అతలాకుతలం ఆనాటి స్వాతంత్రోద్యమం .
సంయమనంతో పాటించిన అహింసావాదం
తెల్లవాన్ని తరిమి కొట్టి తెచ్చి పెట్టె స్వాతంత్య్రం.
స్వాతంత్య్రపు సంబరాలు అంబరాన్ని అంటినా ...
స్వయంగా తాను పాటించిన ఆహారనియమాలే
అహింసావాద సంయమనానికి నాంది అంటే మాత్రం .....
పలాయనం పాటిస్తారు ప్రజలూ ప్రభుత్వాలూ!
మత్తు పానీయాల నిషేధం, శాఖాహార ఫలాలు
మచ్చుకు దీక్షల్లో పాటించి మది మదిన పొగుడుతారు.....
మనువంతా పాటిస్తే మరలిరాదా స్వర్గం......
సంయమనంతో సావాసం సాధించు మానవ కళ్యాణం.
అందరికీ తెల్సిన విద్యే అయినా
అధిగమించి పాటించేది ఎందరు.....
ఆదరించి అమలుపరిస్తే ప్రతివారు
అందుకోవచ్చు ఆరోగ్యపు హిమాలయాలు.....
నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)
No comments:
Post a Comment