Monday, July 10, 2017

నగదు రొక్కం - నాడు - నేడు

ఊరంతా జనానికి ఉద్దెర బతుకులే  ఆనాడు
సగటు సంఘ జీవి సజావుగా బతకడానికి
నగదు రూపాయలు కావాలంటే
మారాజుల గడప తొక్కాల్సిందే
నాగా నట్రా కొరకు కాదు మిత్రమా
భూమి పుట్రాకు అస్సలు కాదు నేస్తమా
అయినా దొరికేది కాదు నగదు ఆనాడు
కాలాడాలన్నా  , చేయాడాలన్నా 
కడుపులోకి గంజి నీళ్లు చేరాలన్నా
ఇంటిదానికి పథ్యం కూడు పెట్టాలన్నా
సంటోడికి వైద్యం చేయించాలన్నా
ఎవుసానికి దున్నో , ఎద్దో  కొనాలన్నా
పండిన పంట అమ్ముకోవాలన్నా
పల్లె జనాలకు పైసలు దొరికేవి కావు
చుట్టం చూపు పోవాలన్నా,పెళ్లి పేరంటాలకు వెళ్లాలన్నా
చావు, బతుకులకు కలుసుకోవాలన్నా
దూర ప్రయాణాలు వెళ్లాలన్నా
నగదు రూపాయలు దొరికేవి కావు
ఆమడల దూరం కాలి నడకలే ఆనాడు
పది రూపాయలు మన తాన ఉంటె
పదిలమౌతుంది మన ప్రయాణం అనుకునేవారు
నగదు రూపాయలు కావాలంటే
నెల ముందు నుండి పోరాడే వాళ్ళు ఆనాడు
పదే పదే  యాదికి చేసి పది రూపాయలు పట్టుకెళ్ళేవారు
భూమి గుండ్రంగా ఉన్న చందంగా
 నాటి సమస్యే ఈనాడు మరో రూపంలో

మనమంతా నెత్తి కెత్తుకుంటున్నాం

No comments:

Post a Comment