Friday, July 14, 2017

అబ్దుల్ కలాం సారూ అందుకోండివే సర్వ జనా నివాళి

బిగ్ న్యూస్ పేరిట టి .వి. లలో బిగ్ బాంగై  మోగింది 27..07. 15 సాయంత్రం
కలాం గారి నిర్యాణం  కల కలం రేపింది -కన్నీటి వేదన మిగిల్చింది సర్వ జనావళికి

నిజాయితీ కలిగిన ఉద్యోగిగా -నీతి వంతమైన పాలకునిగా
సిద్దాంతాలకు కట్టుబడి నిలబడినాడు-  స్వయంకృషితో సాధించాడు

పట్టుదల, దీక్షలకు ప్రతిరూపమై - ప్రకాశ వంతమైన వర్చస్సుతో
పరితపించి , పరిశ్రమించే వారి తత్వం - ప్రతి వారిని పులకింప చేస్తుంది

విద్య వినయం కలబోసిన రూపం -చిరునవ్వులు చిందించే మూర్తిత్వం
భవిత మీదేనని యువతకు చాటి- మేల్కొల్పిన నిత్య కృషీవలుడు  

మచ్చ లేని మానవత్వం - మచ్చుకైనా కాన రాని డాంబికత్వం
నిలువెల్లా పులకించే దేశభక్తి -నిలువరించు ప్రతివారిని, వారి నైజం

నిరంతర విషయ సంగ్రాహి - నిత్య ఉపాద్యాయ విద్యార్థి
సూక్ష్మ గ్రాహి , స్పురద్రూపి - స్ఫూర్తి దాత, మార్గ దర్శి, నిర్దేశి

శాస్త్ర సాంకేతికతలో నిష్ణాతుడై- ఆకాశమే హుద్దుగా ఎదిగినా
కాలిపర్స్, కలాం రాజు స్టంట్ లతో - సగటు ప్రజలకు సైతం సార్థకత చేకూర్చారు

లెక్క లేనన్ని అవార్డులు - లెక్కకు మించిన రివార్డులు
విశ్వ విద్యాలయాల డాక్టరేట్లు - విశ్వ దేశాల ఫెలో షిప్పులు

పేపర్ బాయ్ నుండి ప్రెసిడెంట్ వరకు - రామేశ్వరం నుండి రాజ భవన్ వరకు
స్వయం కృషి తో సంధించుకున్నాడు - గగనతలం లో నక్షత్రమై నిలిచాడు

అఖండ ప్రయాణం సాగించి -ఆఖరు క్షణం వరకు ఆరాటపడి 
అనాయాస పవిత్ర మరణం తో - అమరత్వం పొందిన మహానీయా     
అందుకోండి వే  మా  సర్వ జనా నివాళి                                 

No comments:

Post a Comment