పెద్ద నోట్ల రద్దు పెను దుమారమైనది పెద్దల సభలో
నాణేనికి రెండు వైపుల్లా , మాయ
మర్మంలా
మనందఱకు సంపూర్ణముగా అర్థం కాని
మంచి చెడులు-రెండూ ఉన్నాయి
మంచి చెడులు-రెండూ ఉన్నాయి
రధ్దు వలన - రాబందుల్లాంటి నల్ల కుబేరుల,
లంచ గొండుల , ఆటంక
వాదుల , అల్లరి మూకల
అనాయాస సంపాదనలన్నీ కకా వికలమైనయి
కళ్లెం వేసిన గుర్రమై - చెప్పు
చేతుల్లోకి వచ్చినయి
పెద్దనోట్ల మారకం బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారానే కాబట్టి
పెద్దనోట్ల మారకం బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారానే కాబట్టి
ఎప్పుడంటే అప్పుడే వారి వివరాలిప్పుడు
పాలకుల చేతికి అతి చేరువై అందుబాటులోకొచ్చాయి .
నిద్రలేని రాత్రులే వారికింకా దిక్కు.
నష్టాలు స్వల్పకాలం - లాభాలు
దీర్ఘ కాలం
ఒక్క ఉదుటున ఆగిన పెద్దనోట్ల వలన
వినియోగం తగ్గి, ఉత్పత్తులు
నిలిచిపోయాయి
అమ్మకాలు , కొనుగోళ్లు
సన్నగిల్లి ఊపిరాడక
అవసరాలు మాత్రమే తీర్చుకుంటున్నారు- ప్రజానీకం
అవసరాలు మాత్రమే తీర్చుకుంటున్నారు- ప్రజానీకం
ప్రభుత్వాలకు పన్ను రాబడి కొంత తగ్గినా
వ్యాపారుల లాభాల నల్ల బాట భారీగా తగ్గినది
పలు రకాల ప్రజలకు ధనం విలువ కూడా తెలిసినా
కాయ కష్టం చేసుకునే వారికి కొంత ఇబ్బంది కలిగినది
తద్వారా ప్రజా సంక్షేమ పనులు కొంత వెనుకబడతాయి
కాని మన ఉత్పత్త్తులు , సంపద
మనకే మిగులుతాయి
విచ్చలవిడి నకిలీ నోట్లతో మన సంపద కొల్లగొట్టబడి
అసలు నోట్లు కలిగిన సిసలైన వారికి మొండి చేయి దక్కేది.
కాని అలాంటి అవకాశాన్ని అరికట్టగలిగాము.
లక్షలు , కోట్లు ... కాదు కాదు లక్షల కోట్ల కుంభకోణాలు
అమాంతం మింగేస్తున్నారు లజ్జ లేని కొంత మంది.
లక్షలు , కోట్లు ... కాదు కాదు లక్షల కోట్ల కుంభకోణాలు
అమాంతం మింగేస్తున్నారు లజ్జ లేని కొంత మంది.
అందుకే అవసరమయ్యింది పాశు పతాస్త్రం.
మాటికి మాటికి మార్చవలసి వచ్చినది నియమాలు
రంగులు మారుస్తున్న నేర సామ్రాజ్యవాదుల కోసం
చిక్కులు తెలియని సామాన్యుల కోసం
పరిస్థితుల నధిగమించడం లేదా పరిపాలన సౌలభ్యం కోసం
No comments:
Post a Comment