ప్రతి వారికి హృదయాంతరాలలో స్పందనలు కలుగుతూనే ఉంటాయి
. వాటిని
సరైన సమయములో ఒడిసి
పట్టుకుని సందర్భానుసారముగా
ఇతరులకు ఇంపుగా , సంతృప్తి చెందే
విధంగా కవనముగా కూర్చడానికి అనేకానేక దశలు
ఇమిడి ఉన్నాయి. ఒక శిల్పికి పనిముట్లు ఎంత
అవసరమో - అలాగే కవికి
కూడా ఈ దశలే
పనిముట్లు గా ఉపయోగపడతాయి.
శిశు దశలో అమ్మ సంరక్షణ లో, మార్గదర్శములో ఉండి , బాల్యములో నాన్నగారి మార్గదర్శకం, భరోసాలాతో అడుగులు వేస్తాము. బడిలో విద్యార్ధి దశలో గురు బోధనలు, మార్గదర్శక నిర్దేశాలు - సంఘములో మన ఆలోచనా వివేచనాలతో ఏరి కోరుకునే మంచి మిత్రులు , మనం నివసించే సంఘ సమూహం , సమకాలీన పరిపాలన విధానాలు ..... ఇలా చాల చాలా విషయాలు మనలను / ప్రతివారినీ ప్రభావితం చేస్తూ స్పందనలకు ఊపిరి పోస్తాయనడములో సందేహము లేదు.

నా జీవితములో నా
దారి, తెన్నుకు అమ్మా
నాన్నలు ఎంతో ప్రభావితం చేశారు.
మాకు ఎంతో స్వేచ్ఛ నిచ్చి
ఎప్పటికప్పుడు
బ్రతుకు గమ్యములో దిశా నిర్దేశాన్ని సున్నితంగా , సూచనప్రాయంగా చూపిస్తూ అమోఘమైన సలహా
సందేశాలతో తీర్చి దిద్దారు.
నా భార్య శ్రీమతి ధనలక్ష్మి ప్రతీ
కవితకు తొలి శ్రోత.
నా కుమారుడు- కోడలు
శ్రవంత్ కుమార్ - అర్చన, కూతురు
- అల్లుడు- మనుమరాలు -- శ్వేత
- చంద్రశేఖర్ , అక్ష
మరియు కొంత మంది
మిత్రులు
మలి శ్రోతలు.
ఈ మధ్యనే శ్రీ మేక రవీందర్ గారి ఆధ్వర్యములో వాట్సాప్ గ్రూప్ లో సహస్ర కవి సమ్మేళనము అనే గ్రూప్ లో ముందు వ్రాసినవి , ఈ సంకలనంలోని అనేక కవితలు పోస్ట్ చేసి ఎందరో మహానుభావుల సలహాలు కూడా స్వీకరించడం అయినది. వీరందరి ప్రోత్సాహముతో నేను సంఘర్షించి, సంతృప్తి చెందిన సందర్భాలను అక్షరమాలలు గా కవనించి మీ ముందుకు ఒక సంకలనం రూపంలో తీసుకుని రావడానికి మరోసారి సాహసిస్తున్నాను. వీరందరికి హృదయపూర్వక ధన్యవాదములు. మీ అందరి ఆదరణ పొందుతాయని ఆశిస్తూ.....

అడిగినదే తడవుగా చక్కని పెయింటింగుతో నా ఈ కవిత
సంకలనానికే వన్నె తెచ్చే విధంగా
కవరు పేజీ చిత్రీకరించి ఇచ్చిన
శ్రీమతి అరుణ రాజేందర్ గారికి
ప్రత్యేక ధన్యవాదములు.
తక్కువ సమయములో ప్రింటింగ్ చేసి
సహకరించిన మిత్రుడు ఆంజనేయులు వెంకటేశ్వర ప్రింటర్స్ కి ధన్యవాదములు.
నా తొలి కవితా
సంకలనం "మాతృ వందనం" మా మాతృ
మూర్తులైన శ్రీమతి నగునూరి నరసమ్మ గారికి అంకితమిచ్చాను . ఈ
మలి కవితా సంకలనాన్ని "పితృ వందనం"
మా పితృ మూర్తులైన దివ్య
శ్రీ నగునూరి దశరథం
గారికి అంకితమిస్తున్నాను.
ఇంకా ఎంతో సేపు
మిమ్ము వాకిట నిలిపి
ఉంచడం మర్యాదకాదు. పదండి
లోపలికి.....
No comments:
Post a Comment