పర్యావరణం అంటే పక్కవాడి గోడు కాదు -
పర్యావరణం అంటే భూమి,నీరు, గాలి, ఆకాశం
పర్యావరణం అంటే భూమి,నీరు, గాలి, ఆకాశం
ప్రపంచ ప్రజలందరిది -
చెట్లు పుట్టలు కొండ కోనలు
హాయి గొలిపే పచ్చిక బయళ్ళు - హోయలోలికే
జలపాతాలు
ప్రకృతి మనకిచ్చిన పర్యావర (ణ )మ్ -
పూర్వీకులు మనకందించిన అమూల్యమైన భరణం
పూర్వీకులు మనకందించిన అమూల్యమైన భరణం
ఆటవికమైన ఆకారాలకు -ఆవాసాలు లేని అనాగరికులకు
నిలకడ తెలువని నియాందర్త ల్ లకు -
చరిత్ర నిచ్చింది చక్రం పనిముట్లు……ఆనాడు
చరిత్ర నిచ్చింది చక్రం పనిముట్లు……ఆనాడు
రాకాసి బొగ్గు, రైలింజన్లు, రాకెట్లు, రవాణా సాధనాలు,రక రకాల
ఇంధనాలు
రమ్యమైన
కమ్యూనికేషన్లు -పల్లె పట్నం తేడా
లేక ఎల్లెడలా రంగు రంగుల జీవితాలనిచ్చాయి...... ఈనాడు
లేక ఎల్లెడలా రంగు రంగుల జీవితాలనిచ్చాయి...... ఈనాడు
కాలుష్యాలకు కారణాలనేకం - అధిక
జనాభా, నిరక్షరాస్యత
పట్టణీకరణ, పారిశ్రామికీకరణ - అరణ్యాల క్షీణత,
అలసత్వం
కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు - కలకత్తా నుండి వొకా
వరకు
కదలాడే రైలు బండి సాక్ష్యం -కవరు చిరిగిన పాలితీన్లకు
పారిశ్రామిక వాడల వ్యర్థాలు - వాహనాల విషవాయువులు
పేరుకు పోతున్న ఎలక్ట్రానిక్ వస్తువులు -
పర్యావరనానికే ప్రశ్నార్తకమౌతున్నాయి
పర్యావరనానికే ప్రశ్నార్తకమౌతున్నాయి
కావేవి అనర్హం కలుషిత వాతావరణానికి
గుండు సూది తయారీ మొదలు -కొండ తొలుచు వరకూ
పాడి పంటలు మొదలుకుని పసివాడి పాల వరకు
చివరకు ప్రాణ దాతలైన పవిత్ర మందులు సైతం - కలుషితమే
జల కాలుష్యం, వాయు కాలుష్యం -
వాహన కాలుష్యం -శబ్ద కాలుష్యం
వాహన కాలుష్యం -శబ్ద కాలుష్యం
యాంత్రీకరణ కాలుష్యం - ధూళి కాలుష్యం -
సకల కాలుష్యాల ఫలితమే - ఒజొనుకు గండి
సకల కాలుష్యాల ఫలితమే - ఒజొనుకు గండి
అతి వృష్టి, అనావృష్టి, కరువు కాటకాలు,
భూకంపాలు, సునామీలు , ప్రకృతి భీభత్సాలు
జల ప్రళయాలు - కొత్త కొత్త
అనారోగ్యాలు
ప్రతీది పర్యావరణ ఫలితమే ……………
మానవ తప్పిదాలే - మానవాళికి విషమ స్థితి
పెచ్చరిల్లే ఉపద్రవాలను - నియత్రించలేని దుస్థితి
అలసత్వాన్ని వీడి మనమంతా కళ్ళు తెరవాలి
పొంచి ఉన్న ముప్పులను గుర్తెరిగి నడచుకోవాలి
పర్యావరణాన్ని పరి రక్షించడానికి
మాట సాయమే కాదు - చేత సాయం చేస్తూ
పరిశుభ్రతలను పాటిస్తూ - పర్యావరణాన్ని రక్షిస్తూ
ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవిద్దాం
ప్రభుత్వ శాసనాలు, పథకాలు ఎన్ని ఉన్నా -
పౌర సహాయం ఉంటేనే - ప్రణాలికలు సాఫల్యం
ప్రశస్తమైన పర్యావరణాన్ని -ముందు తరాలకు అందిద్దాం -పౌర సహాయం ఉంటేనే - ప్రణాలికలు సాఫల్యం
పవిత్రమైన కానుకగా .....
No comments:
Post a Comment