సైనికుడా వందనం - సంరక్షకుడా వందనం
అపూర్వం నీ ఉద్యోగ ధర్మం - అనిర్వచనీయం నీ త్యాగ ఫలం
కన్న తల్లి తండ్రులకు - కట్టుకున్న ఇల్లాలుకు
కని పెంచే పిల్లలకు - కడు దూరం నీ నివాసం
కొండ కోనలలో - వాగు వంకలలో
చిన్న చిన్న డేరాలతో - కదలాడే నీ ఆవాసం
చిన్న చిన్న డేరాలతో - కదలాడే నీ ఆవాసం
సరిహద్దుల్లో - పగలు రాత్రి - ఎండా వాన ఎల్లెడలా
సున్నా డిగ్రీ సెంటి గ్రేడైన - ఆగని నీ పహారాతో
ప్రజా సంక్షేమమే - పండుగలు పబ్బాలు
దేశ శ్రేయస్సే నీకు - ఉచ్వాస నిచ్వాస
దేశ శ్రేయస్సే నీకు - ఉచ్వాస నిచ్వాస
కోటాను కోట్ల దేశ ప్రజలు - నిబ్బరంగా
నిలవడానికి
ఆటు పోట్లను తట్టుకుని - ఆదమరిచి నిదరోవడానికి
అగ్ని ప్రమాదాలు - వరద భీభత్సాలు - వెల్లువెత్తినప్పుడు
అత్యవసర పరిస్థితులు - ఆపదలు సంభవించినప్పుడు
అత్యవసర పరిస్థితులు - ఆపదలు సంభవించినప్పుడు
ఆదుకోవడం లో నీవు చూపే చొరవ - అనిర్వచనీయం అత్మీయుడా
సదా బాధ్యతలు నిర్వర్తిస్తూ - సంయమనం పాటిస్తూంటే
సాక్షర సన్మానం తో - సెల్యూట్ చేస్తా సో దరా
No comments:
Post a Comment