కరుణ గల్ల వరుణుడు
- ఎందుకో కన్నెర్ర జేస్తున్నడు
కర్షక లోకాన్ని-
కకావికలం కావిస్తున్నాడు
అల్ప పీడన ద్రోణిగా
- రైతు పీడనకై
వస్తున్నవి
అకాల వర్షాలకు
- ఆగమై పోతూనే ఉన్నడు అన్నదాత
అదిలాబాదు
మొదలుకుని
- ఆసాంతం రాష్ట్రములో
అతలా
కుతలమౌతున్నది - ప్రజా జీవితం పదే
పదే
క్యుములో
నింబస్
లంటూ
- కుమ్మరించి పోతున్నయి
కుదేలై
పోతున్నయి
పంటలు - కుండపోత
వర్షాలకు
వరిపంటలు,
వాణిజ్య
పంటలు
- పండ్ల తోటలు
వరుసబెట్టి
పాడై
పోతున్నయి
- మోడువారి పోతున్నయి
చేతి
కందే
పంట
గింజలు
- నేల రాలి పోతున్నయి
వడగండ్ల
వానలోచ్చి-
కడగండ్లు
మిగుల్చుతున్నయి
అనావృష్టితో
కొన్నాళ్ళు - అతివృష్టిలతో
కొన్నాళ్ళు
ఆరుగాలం
శ్రమించే
రైతన్నలు
-
అదేపనిగా అపదల నెదుర్కుo టున్నారు
అదేపనిగా అపదల నెదుర్కుo టున్నారు
బిక్క
వోయిన
బక్క
రైతన్న - దెబ్బ దెబ్బకు
చిక్కి
శల్యమై
బ్రతుకు
చిద్రమై
- బజారున పడుచున్నాడు
కంటికి
రెప్పలా
కాచుకున్న
పంటలన్నీ
కబలించుకు
పోయే
- కరుణ గళ్ళ వరుణుడు
అకాల
వర్షాలకు
- ఆగమౌతున్న ఆత్మబంధువు రైతన్నను
సకాలంలో స్పందించి - సాయమందించాలి ప్రభుత్వాలు
No comments:
Post a Comment