సహజ సమాజ మార్పు
అవసరం
అయినా
కాకున్నా
వస్తూనే
ఉంటుంది
ప్రజల సహాకారంతో,
ప్రజల
హితం
కొరకు
వచ్చేదే
పది
కాలాలు
నిలుస్తుంది
రాతి యుగం దాటుకుని మారుతూనే
ఉన్నాము
మార్పులోనే
పుడుతున్నాం
- మార్పులోనే పెరుగుతున్నాం
కాని అవసరమైన
మార్పు
మాత్రం
పాటించరు
( రాజు – పేద)
దేవ దానవ సంగ్రామములు
సమసి
పోయి
నేడు ముష్కర
దాడులు
జరుగుతున్నాయి
రాజుల రోజులు
పోయి,
రాజ్యాలు
పోయి
ప్రజల రాజ్యాలు
ఫరిడవిల్లుచున్నాయి-
అయినా ఆర్ధిక అంతరాలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి
చాతుర్వర్ణాల
వ్యవస్థలు
పోయి
పాలనా నాయకులు,
పాలనా
అధికారులు
రక్షణా
అధికారులు
, న్యాయాధికారులు కలిగిన
చతుర్విధ ప్రజా పాలన వ్యవస్థ
లొచ్చాయి
–
అయినా సామాన్యునికి న్యాయం అందని ద్రాక్షే అవుతున్నది
అంటరాని
తనము
పోయి
అంటువ్యాధిలా
విస్తరిస్తున్నది
లంచగొండి
తనం
ఆచార వ్యవహారాలు
అంతరించి
అతలా కుతలం అవుతున్నది
పర్యావరణం
–
–
"మనీ"షి మారకుంటే
మారణ హోమమే సుమా
ప్రజా సంక్షేమం
కొరకు
ప్రభుత్వాలు
చేసే
ప్రాథమిక
మౌలిక
అవసరాలు
- రోడ్లు,విద్య,
విద్యుచ్ఛక్తి
,ఆరోగ్యం
అంతరించి
ప్రైవేటు వ్యక్తుల
ఆధీనములో
బ్రతుకు
వెల్లదీస్తున్నాం
–
పేర్లు మారిన - తీరు మారడం లేదు
రాజకీయం
కూడా
ప్రైవేటు
పరమైతే
రాజ్యాలు
సామంత
మైనట్టే
కదా
భూమి గుండ్రముగా
ఉన్న
చందముగా
తిరుగు
ప్రయాణమే
చేయాలా –
మళ్ళీ
బానిస బ్రతుకుల వైపేనా మన అడుగులు?
No comments:
Post a Comment