Friday, July 14, 2017

చెన్న పట్నం చిన్న బోయింది

During   Nov - Dec.,2015

మొన్న  దివి సీమ ఉప్పెన సంభవం -

నిన్న తీరాన్ని కుదిపిన సునామి, హుదుద్ 

నేడు చెన్నైని  చెండాడిన  జల విలయం - 

ప్రతీది ప్రకృతి ప్రకోపమే, మానవాళి చర్యకు ప్రతి చర్యే  


మదరాసులో  ఈనాడు జలకీలలు ప్రవేశించి - 

మనిషి దురాగతాలకు నిలువెత్తు  సాక్షిగా 

మారణహోమం సృష్టించి ,మరువలేని గాయాలను మిగిల్చి -

మరు భూమిగా మారుస్తున్నది 


చెరువులు, కుంటలు , నాలాల అడవుల కబ్జాలతో

గ్రానైట్  కంకరలతో  ప్రకృతిపరమైన గుట్టల మాయం 

వాగుల, వంకల  ఇసుక మాఫీ యాలు కలిసి  - 

మన బ్రతుకులను శాసిస్తున్నారు.

తోడుగా ఉండి, సంఘమై నిలిచి  - 

సంక్షేమం చూస్తారనుకుంటే 

తోటి వారిని తోడేళ్ళ వలె పీక్క తింటున్నారు - 

అమాయకులను ఆగం చేస్తున్నారు 


రాజకీయమనే   రంగుతో భాద్యత మరచి  - 

రంకు చేస్తున్నారు  చాలామంది  నాయకులు 

అధికారులు  కొంతమంది అందినంత  దండుకుంటూ  - 

అధః పాతాళానికి నెడుతున్నారు సంఘాన్ని 
  

ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ప్రతీ వారు - 

పదిలంగా తమ వంతు పాత్ర పోషిస్తూ 

పతన సో పాన ప్రయాణానికి -

పద పద మని పరుగు లంఘింప చేస్తున్నారు  



ప్రశ్నించే గుణ మెరుగని ప్రజానీకం  - 

కళ్ళు మూసుకునే అధికారగణం

వొళ్ళు తెలియక ప్రవర్తించే రాజకీయం

వొళ్ళు బలిసి ప్రవర్తించే గుండాయిజం


వెరసి మధ్య తరగతి ప్రజా బలి  - 

బలహీనుల వద- పరోక్ష నర మేదం 

టెర్రరిస్ట్ కన్నా భయంకరం  - 

ముష్కరులకన్నా మూర్ఖత్వం


రాజుల రోజులు పోయి రాజ్యాలు మారినా - 

లజ్జ వదిలి లక్షల కోట్లు మింగే వారుంటే 

సామ్యవాదం పేరు చెప్పి ప్రజాస్వామ్యం వచ్చినా -

సాగుతుందా సగటు మనిషి బ్రతుకు సజావుగా 


పత్రికలూ  మీడియాలు పనిగట్టుకుని - 

సమిష్టి భాద్యతలను సంభోదిస్తూ 

పదే పదే గుర్తు చేస్తూ (follow up) - 

పట్టుదలతో వ్యవహరించి పద నిర్దేశం చేయాలి  


రామ రాజ్యం కాక పోయినా - 

ప్రజాస్వామ్యాన్ని పదికాలాల పాటు 
ఫరిడవింప  చేయడానికి  సంఘములో ప్రతీ అంగం  - 

పాలకులు,అధికారులు, పత్రికలు,ప్రజలు 

తమవంతు భాద్యతలను  గుర్తించాలి  

No comments:

Post a Comment