Friday, July 14, 2017

గంగలో మునిగేద్దాం - పాపాలను కడిగేద్దాం

గంగా నది ప్రవహించే -పుణ్య భూమి మనది 
గర్వించ తగిన- చరిత్ర కలిగిన పురాణాల నిలయం మనది 

హిమాలయాలలో పుట్టి- ఋషికేశ్ మీదుగా 
వేల మైళ్ళు పయనించి -సాగరం చేరుతుంది

అనేకానేక  ఓషదులతో - కొండ కోనలు  దాటుకుని 
సారవంతమైన నేల తల్లిని - మనకందిస్తూంది 

మైదాన ప్రాంతాల మీదుగాబ్రతుకు బాటకు ఆధారమయ్యే
లక్షల ఎకరాల పంట పొలాలకు- జీవ ధారగా నిలుస్తుంది 

నరుడు బ్రతకాటినికి - నాగరికత నేర్పిన గురువుగా 
తర తరాల నుండి  - తరగని చలిమెల నీటితో 

వేల కోట్ల జనులకు - చేయూతనిస్తూ నిలుస్తున్నది 
వెల లేని సేవలతో  - నిస్వార్థానికి  సంకేతంగా   


కాని మన స్వార్థాలకు - పాలకుల  నిర్లక్ష్యాలకు 
 కలుషితమౌతూనే ఉన్నదిమౌనంగా నిలుస్తూ 

తీర ప్రాంత పట్టణాల , పరిశ్రమల వ్యర్థాలతో,పాలితిన్లతో 
కడకు కలేబరాలతో- మృత దేహాలతో కలుషితం చేస్తున్నాం

కళ్ళు తెరవండి ఇకనైనా - కలుషితాలను అడ్డుకోండి , లేదంటే 
కాన రాకుండా పోయే ప్రమాదముంది మిత్రమా .... మానవాళి 

మనవంతు"మాట" సాయం – "చేత"  సాయం  చేద్దాం 
కదలించండి ప్రతి వారిని - కబలించక ముందే మన  జాతిని

No comments:

Post a Comment