ముష్కరులకు మేలౌతుందని తీయించారు
చతుశ్శ క్ర శకట
వేడి నిరోధక పరదాలు
ఆడపడుచులపై అఘాయిత్యాలు చేస్తుంటే
అధికారులకెందుకో అంత మోజు హెల్మెట్లపై
సురాపానంతో సుభిక్ష కుటుంబాలు
సునామీలో చిక్కు కుంటుంటే
పన్నులేసి పబ్బం గడుపుకుంటున్న
ప్రభుత్వాలు పక్కకు తప్పుకుంటున్నాయి
ధూమపానం, గుట్కా సేవనాలతొ
ప్రజా ఆరోగ్యాలు పతనమౌతుంటే
పరోక్షంగా దన్ను నిలుస్తూ
ఫణంగా పెడుతున్నారు పర్యావరణాన్ని ప్రజా జీవితాలను
సవాలక్ష సౌకర్యాలు సమకూర్చినా
సంక నాకి పోతున్నయి దవాఖానాలు
సపర్యలందించక సచ్చుఁ బడి పోతున్నా
సరైన దిద్దుబాటు కరువై పోతున్నది
సందు గొందుల్లో ఉన్న ప్రైవేటు చదువులు
చంద మామను అంటుతుంటే
సర్కారు బడులు సట్టు బండలై పోతున్నాయి
సగటు మనుషులకు చదువులు అందని ద్రాక్షాలౌతుంటే
సర్కారు బడులు సట్టు బండలై పోతున్నాయి
సగటు మనుషులకు చదువులు అందని ద్రాక్షాలౌతుంటే
సంఘ సంస్కర్తలే
కరువయ్యారు
ప్రభుత్వాలు ఒప్పుకుంటే తప్పులు - ఒప్పులు
ప్రజలు నిలదీస్తే ఒప్పులు-తప్పులు
ప్రజల క్షేమం నిక్కచ్చిగ కోరి పాలించే
ప్రభుత్వాలు కావాలి మిత్రమా ఈనాడు
రాజకీయాలతో రంకు చేస్తున్న నేతలూ …
రామ రాజ్య సుభిక్షం కోరితేనే
పాలనకు పదిమంది ప్రజలుంటారు
ప్రజలుంటేనే పది కాలాలు పాలించవచ్చు…..
No comments:
Post a Comment