కోట్ల మందిని రోజూ గమ్యాలకు చేరవేస్తూందంటూ
లక్షల కిలోమీటర్లు రోజువారీ ప్రయాణాలంటూ
లక్షల కిలోమీటర్లు రోజువారీ ప్రయాణాలంటూ
అత్యధిక సామాన్యులు అనుసరించే ప్రయాణ సాధనమంటూ
ప్రత్యేక బడ్జెట్ సౌకర్యమున్న అతి పెద్ద సంస్థ మన రైల్వేలు
ఉద్యోగుల ఉదాసీనతా - అధికారుల
అనాసక్తతా-సచివుల బూచీలా
ఆటంక వాదుల కంటక చర్యలా ,బూటకపు
వాదుల కపట నాటకమా,
వెరసి వందల వేల కుటుంబాల కకావికలం, అంగవైకల్యం
గత రెండు నెలల్లో నాలుగు ఘటనలతో సవాలు విసిరింది
మొత్తానికి వందల మంది ప్రాణాలు అనంత వాయువుల్లో
అనేక కుటుంబాలకు ఆగమ్య గోచరమై నిలిచింది
చకోర పక్షుల్లా సాయానికి ఎదురు చూసారు
ఇలాంటి తప్పిదాలు జాతి మొత్తానికి ప్రశ్నార్థకమై నిలిచాయి
అడిగినంత టికెట్ ధరలు చెల్లిస్తున్నాము
దండినంత పన్నులు దండుకుంటూనే ఉన్నారు
అండగా ఉండే రక్షణ చర్యలు మాత్రం అంతంతమాత్రమే
దుండగులవల్ల , దుర్ఘటనల
వల్ల దురదృష్టం వెంటాడుతూనే ఉంది
మూడు వందలు, నాలుగు వందల కిలోమీటర్లు
గంట గంటకంటూ విశ్వదేశాలు బులెట్ ట్రైన్లతో ముందుకెళ్తుంటే
ఇంకా మనం కనీసం ప్రమాదాలు లేని ప్రయాణాలు కూడా
కల్పించలేమా? మన
ప్రజల ధన,
మాన,ప్రాణాలు కాపాడలేమా ?
రైల్వే ఉద్యోగులు, అధికారులు,
సచివులు, ప్రజలు
ప్రతీ వారు కదలండి - ప్రగతి కొరకు కల్సి రండి
ప్రతి చిన్న అశ్రద్దను ప్రతిన బూని అధిగమించండి
ప్రజల జీవితాలలో
ప్రశాంతతను నింపుదాంప్రతి చిన్న అశ్రద్దను ప్రతిన బూని అధిగమించండి
No comments:
Post a Comment