హిందూ రక్తములో ఇమిడి ఉన్న గుణం
పల్లె బతుకుల్లో ప్రతి గుండెలో ఉన్న సూత్రం
పట్న జీవనంలో కూడా పెనవేసుకున్న తత్వం
ప్రదేశాలు (STATES ) సైతం పాటిస్తున్న ధర్మం
అదే అఖండ భారతావనికి ఆయువు పట్టు
UNITY IN DIVERSITY IS THE MOTTO
దేశ సమగ్రతకు సరైన దిశా నిర్దేశమిచ్చు దిక్సూచి
ప్రజాతంత్ర పాలనకు పరమ సంకేతం
సాక్షాత్తు పరమ శత్రువును సైతం 17 సార్లు
సహనంతో వదిలిన చరిత్ర కలిగిన దేశం మనది
అహింసను ఆయుధముగా మలుచుకుని
అజేయంగా స్వాతంత్ర్య పోరాటం సలిపి
అఖండ భారతావనికి స్వాతంత్య్రం ఓర్పు మనవారిది (బాపూజీ)
పరిశ్రమలెన్నో CD CSR పేరిట చేస్తున్నదే
పరిసర గ్రామాలను దత్తత తీసుకుని
విద్య, వైద్యం,నీరు,రోడ్లు ,స్వయం ఉపాధి శిక్షణలు మొదలు
సవాలక్ష సమస్యలను నెత్తి కెత్తుకుంటున్నారు
అనేక సార్లు మన దేశ భూభాన్ని పంచుకున్నాయి చాలా దేశాలు
అయినా సంయమనం, సుహృద్భావం పాటిస్
సార్క్ దేశాలన్నింటినీ కలుపుకు ఎదగాలని
సంఘీ భావం ప్రకటిస్తూ దూసుకెళ్తున్నది మన దేశం
ప్రపంచ దేశాలన్నీ కలియ తిరుగుతున్నాడు
ప్రగతికి టెర్రరిజం ఆటంకం అవుతుందంటూన్నాడు
ప్రతీ వారు ప్రజా సంక్షేమాన్ని కోరుకుని పరిరక్షించాలంటున్నాడు
ప్రత్యేక ఉపగ్రహాన్నే సార్క్ దేశాల సమిష్టి ప్రయోజనాలకు కానుకగా ఇచ్చారు
విశ్వ దేశాలలో, వినీలాకాశములో ఇంతవరుకు
ఏ అగ్ర రాజ్యం చేయని అమూల్యమైన,
అనన్య సామాన్యమైన ఆలోచన విధానం తో
అక్షరాలా అమలు పరిచి అనవరతమై నిలిచింది
ఇల్లు, వాడ, పల్లె, పట్నం, ప్రదేశం, దేశం, ఖండం
ఏదైనా ఇదే సందేశం - విశ్వే జనా సుఖినోభవంతు
No comments:
Post a Comment