Friday, July 14, 2017

అవని

అవని తొలుత ఆవిర్భవించినప్పుడు

అచ్చంగా పచ్చ తోరణమోలె ఉండెనప్పుడు

జనం పెరిగి  యవుసమని , ఆవాసమని

జంగల్ నరికి అవసరాలు తీర్చుకుంటున్నరు
అందుకే కరువులు, కాటకాలు , నీటి ఎద్దడి

అటకెక్కుతున్నది రోజు రోజుకు పంట దిగుబడి

అడుగంటిన నీటి ఎద్దడితో ఆగమైతున్నరు  ప్రజానీకం

ఆగమైన ప్రజలు తరలిస్తున్నారు పశువులను  కబేళాలకు
పెద్ద మనసుతో మనమంతా మొక్క మొక్క నాటితే

పెరిగి పెద్ద వృక్షాలై- అవని  హరితమయమౌతుంది

భూగోళం వేడి తగ్గి వన్నె పెరుగుతుంది

సకాలములో వర్షాలు పడి సల్లగుంటం మనమంతా
వాగు, వంకలు,ఏర్లు, నదులు  పొర్లిపారితే

చెరువులు, కుంటలు, జలాశయాలు నిండుతాయి

దండిగా నదులన్నీ నిండుగా పారితే

డాములన్నీ జల కళతో తాండవిస్తాయి
నీటి మట్టం పెరిగితే చేను, చెలక చేతికొస్తది

పాడి పంట పెరిగి పిల్లా, పాప పుష్టిగుంటరు

శుచి, శుభ్రతలు పాటిస్తూ, కాలుష్య భూతాన్ని తరిమి

సుఖ సంతోషాలతో మనమంతా జీవించవచ్చు
ఓజోనుకు జరిగే నష్టం అరికట్టవచ్చు

జీవరాశి వృద్ధి చెంది మనగలుగుతుంది

జన జీవనాలలో వన జీవుల వలసలు తగ్గుతాయి

ఘనమైన  జీవితాన్ని మనం అంది పుచ్చుకోవచ్చు

No comments:

Post a Comment