పౌష్టికాహార వారోత్సవాలలో పసిపిల్లలకు
ప్రజలంతా పౌష్టికాహారం ఇవ్వాల
ని
ప్రముఖ వైద్యుల సలహాలంటూ
ప్రతి చానల్ లో వార్తలు వస్తున్నాయి
ప్రజల పట్ల బాధ్యతలను పడ దోసిన
సభ్య సమాజ కనీస నీతి పాటించని కొంత మంది
వైద్య గణం - సుద్దులు చెప్పుతుంటే
మిధ్యలో మేడలు కట్టినట్టు అనిపిస్తుంది
అతి చిన్న అనారోగ్యానికి సైతం అనేక రకాల
పరీక్షలంటూ , రక్త పరీక్షలు, ఎక్స్ రే లు
స్కానింగ్ లు , ఎం ఆర్ ఐ లు , ఖరీదైన
మందులు వ్రాస్తూ, బడా బాబులకు వత్తాసులౌతున్నరు
అలుపెరుగక సంపాదించిన ఆర్యు లెంతో మంది
టాటాలు , బిర్లాలు, అంబానీలు,మిట్టల్ లు
బఫ్ఫెట్ లు , బిల్ గేట్ లాంటి బడా బాబులే
తిరిగి తిరిగి సమాజం వైపే మరలి వచ్చారు
సమ సమాజానికి కావాల్సిన అత్యవసరాలు
విద్య, వైద్యం నానాటికి దూరమౌతున్నాయి
అంధకార బందుర మౌతున్న వైద్య వృత్తి
అంధకార బందుర మౌతున్న వైద్య వృత్తి
అనేక రకాల అపనిందలకు ఆలవాలమైందని -
సమాజమంత కోడై కూస్తున్నదీవేళ
సమాజమంత కోడై కూస్తున్నదీవేళ
కనికరం కలిగి వైద్య వృత్తి నిపుణులంతా
కలుషితమైన ఆలోచనలు మాని
కనువిప్పు కలిగి బయట పడినప్పుడే
కాదా సామాన్యుడికి పండగ - పౌష్టికాహారం దొరకదా పసి పిల్లలకు నిండుగా
No comments:
Post a Comment