Friday, July 14, 2017

అవినీతి, లంచగొండి తనం

అవినీతి,లంచగొండి తనం అంటరానిదే

అయినా చాలామంది అదే జీవితముగా భావిస్తారు  

అత్యంత మూర్ఖమైనది,నీచమైనది

కొంత మంది ప్రాణాలను కూడా బలి  తీసుకుంటుంది

అందరికి హేయమైనదే -  అయినా కొందరు అక్కున చేర్చుకుంటారు
చాలామంది ఛీత్కరిస్తూనే ఉంటారు - అయినా నిత్య నూతన దారుల్లో వస్తుంటుంది

పిల్లలమఱ్ఱి మానులా - విశ్వమంతా విస్తరించినది

అశ్వత్థ వృక్షంలా - అతి నిటారు, లోతైనది

తేనె పూసిన కత్తి లాంటిది - ఎవరి ప్రాణం ఎప్పుడు తీస్తుందో

టెర్రరిస్టులకన్నా ప్రమాదకరమైనది - యుద్ధం కన్నాఎక్కువ ముప్పు కలిగించేది.

ఎదుటి వారి విషయాలు విన్నప్పుడు

ప్రతీ వారికి  రక్తం మరుగుతుంది

ఎదురు పడితే - ఏదైనా చేసేయాలన్నంత 

కోపం నషాళానికి అంటుతోంది

యథా రాజా తథా ప్రజా అన్నట్టు

చాలామంది ప్రజా నాయకులు,పాలకులు,

అధికారులు,ఉద్యోగులు, కాంట్రాక్టర్లు,

ఇంజినీర్లు,గణకులు,న్యాయవాదులు, డాక్టర్లు ,వ్యాపారులు

వారిని చూసి వీరు -వీరిని చూసి వారు

ఎవరో కొందరు తప్ప- అందరూ అదే తంతు

పదులు, వందల  రూపాయల కొరకు -

ప్రాణాలను కూడా ఖాతరు చెయ్యడం లేదు

పచ్చ కాగితాల ముందు మానవత్వం మంట కలుస్తున్నది -

మనిషన్నవాడు మాయమౌతున్నాడు "మనీ" షి  మాత్రమే మిగులుతున్నడు

కుండెడు  తేనెలో ఒక్క నీటి చుక్క వేసిన చందంగా
సంఘమంతా కుళ్ళి కృశించి - కంపు కొడుతుంటే

ఎవరో ఒకరు ప్రయత్నిస్తే  ఏమి మొదలవుతుంది

ఏటిలో పిసికిన చింతపండు వలె - ఎందుకు కోర గాకుండా పోతున్నది

అవినీతి, లంచగొండి తనం, కల్తీ, పర్యావరణ పరిరక్షణ

అన్నీ ఎదుటివారి కొరకనుకుంటారు  - అందరు

భూంరాంగ్ లాగా తమను కూడా మింగుతుందనుకోరు

తమ దాకా వచ్చే సరికి - లబో దిబో మని రోదిస్తారు

ఇచ్చేవారు - పుచ్చుకునే వారు ఇద్దరు నేరస్తులే అయినా

తెలియని మూడో మనిషి కూడా బలవుతాడు కొన్నిసార్లు

"భూంచేసారు లో  కొంత  మంది అమాయకులు కూడా బాలి కావొచ్చు

ఎవరో వస్తారని , ఎదో చేస్తారని కాకుండా

నిగ్రహించి పాటిస్తే - నీతి నియమాలు

ఎదుటివారి వద్ద నుండి కూడా అవే ఆశించవచ్చు
“మంచి తనం”  మనతోనే మొదలు పెడదాము

అవినీతి,లంచగొండి తనం అంతానికి ప్రయత్నిద్దాం

No comments:

Post a Comment