భారత అంతరిక్ష పరిశోధనా ప్రయోగాలకై
భావి తరాల దేశ ప్రయోజనాలకై
పురుడు పోసుకుంది మన ఇస్రో
దక్షిణ భారతాన శ్రీహరి కోటలో 1969 లో
ఆకాశం నీ హద్దురా - అవకాశం
వదలొద్దురా
అన్నాడో మహాకవి ఆనాడే ....
అక్షరాలా అమలు పరిచారు మన ఇస్రో శాస్త్రవేత్తలు
ఆధిపత్యం సాధించారు అంతరిక్ష ప్రయోగాలలో
నిరంతర సేవలందిస్తున్న మన శాస్త్రవేత్తలు
నిప్పులు కక్కి నింగికెగిసే అనేకానేక ఉపగ్రహాలను
SLV,
ASLV, PSLV మరియు GSLV లను
కుప్పలు కుప్పలుగా పంపిస్తూనే ఉన్నారు
రక్షణావసరాలకు కీలకమైనవి కొన్నయితే
విద్య, వైద్య
విధానాల కొరకై ఇంకొన్ని ,
వ్యవసాయ విధానాలకు, ప్రసార
మాధ్యమాలకు,
వనరుల విశ్లేషణార్థం - ఉపగ్రహాలను
పంపిస్తూనే ఉన్నారు
దేశీయ అవసరాలకే కాకుండ
విదేశీ ఉపగ్రహాలను సైతం పంపించి
విశ్వ ఉపగ్రహ విఫణిలో వాణిజ్యానికి సైతం శ్రీకారం చుట్టి
ఉన్నత శిఖరాలు అధిరోహించి విశ్వ విజేతగా నిలిచింది
అంతరిక్ష పరిశోధన ప్రయోగాలలో
అవిశ్రాంత ప్రతిభ చూపిస్తూ మన శాస్త్రవేత్తలు
104
ఉపగ్రహాలను ఏక కాలంలో పంపించి
అత్యుత్తమ రికార్డ్ నెలకొల్పి చరిత్ర పుటల్లో నిలిచారు
రామాయణ , మహా
భారతాలలో పుష్పక విమానాలను
రవాణా సాధనాలుగా వాడారని విన్నాం కానీ
చంద్రయాన్, మంగళ
యాన్ ల రూపకల్పనలతో
అగ్ర రాజ్యాల్ని సైతం అచ్చెరువొందించారు మన శాస్త్రవేత్తలు
నిరంతర సైనిక సేవలు నిరుపమానమైతే
అమూల్యమైనవి మన అంతరిక్ష సేవలు ......
అనితరమైనవి శాస్త్రజ్ఞుల పరిశోధన ఫలాలు
ఏ దేశమేగినా ఎందు కాలిడినా - పొగడరా నీ తల్లి భూమి భారతిని
No comments:
Post a Comment