అరవ వాళ్ళతో ఆడలేక
మద్దెల ఓడు అన్నట్టు
ఆనాడే అరిచి గీ పెట్టి ఓరకుండి నారు
ఆ విషయాలన్నీ మరిచినట్టున్నారు
పెద్ద మనుషులను అడ్డం పెట్టుకుని
సుద్దలెన్నో చెప్పించి పొత్తు కలుపుకున్నారు
మాట మీద నిలువలేదు మనుషులంటే లెక్కలేదు
బ్రహ్మన్న కాలములోనే మొదలయినా
సరైనోడు దొరకక ఆలస్యం అయిందేమో కాని
పదునాలుగేళ్ళు అయినా పడక తప్పలేదు
లక్షల విద్యార్థుల జీవితాలు రోడ్డున పడ్డా
వేల విద్యార్థులు ప్రాణాలు విడిచినా
లెక్క లేదు ఎవ్వరికీ తల్లి తండ్రులకు తప్ప
చంద్రన్న,రాజన్న కాలం లో చీత్కరించినా
నల్లారి వారు సల్లంగ సచివుల మధ్యనే విరిచినా
లగడపాటి వారు పార్లమెంటులో కారం చల్లినా
కలిసి ఉండాలనే విధానమో కాదో తెలియక
ఇక్కడివారు అక్కడి వారు బాధపడే విధంగా
జరగరానిది అనుకున్నామే కాని జరిగి పోయింది
నాయకులకే కాదు మీ బోటి వారు కూడా ఇంతేనా
ప్రక్కవాడు బాగుండాలని ప్రార్థిద్దాం
మనమూ బాగుండాలని కోరుకుందాం
రాష్ట్రాలుగా వేరుపడినా సోదరులుగా కలిసుందాం మిత్రమా

No comments:
Post a Comment