Friday, July 14, 2017

CURRENCY (విలువ మారక మాద్యమము )

ప్రతీ వస్తువుకు ప్రధానముగా రెండు ఉపయోగములుంటాయి

ఉనికి వలన కలిగే ఉపయోగము మొదటిదైతే

వస్తువును మార్చుకుని ఇతర అవసరాలు తీర్చుకోవడం రెండవది

రెండవ విధానమే బార్టర్ విధానమని బహుళ ప్రాచుర్యం

బార్టర్ విధానములో ప్రజా జీవనం బాగానే జరిగినా ……

బహుళ వాణిజ్య  ప్రజావసరాల కొరకై

పాలకులు అందుబాటులోకి తెచ్చారు

పలు రకాల విలువ మారక మాద్యమాలు (CURRENCIES)

రాతి యుగమునుండి నేటి యుగం వరకు

రంగు రాళ్లతో మొదలై, జీవరాశులు , ఆవులు, మేకలు,

తోలు నాణేలు , లోహ నాణేలు,కాగిత ముద్రణలతో,

పలు రకాల విలువ మారక మాధ్యమాలతో

ఫరిఢవిల్లుచున్నది ప్రజా జీవన విధానం

ముందు ముందు ప్లాస్టిక్ కార్డులతో , సంఖ్యా స్థానాత్మక యంత్రాలతో

(DIGITAL MACHINES), ఆన్లైన్ విధానాలతో

ఆస్తుల నమోదులు మొదలుకుని - అతి చిన్న చిన్న చెల్లింపులు సైతం 

అలరారనున్నది రాబోవు రోజులలో మన ఆర్ధిక రంగం

ప్రతి పనికి నిర్దుష్టమైన ప్రణాళిక / విధానమున్నట్టే

పైకం /రొక్కం ముద్రణ సైతం - పలు విధానాల మదింపులతో

ప్రతీ దేశ / జాతి సంపద , సేవలకు గాను రమారమిగా

ప్రభుత్వాలు కరెన్సీలను ప్రజోపయోగమై ముద్రిస్తారు

దేశ సంపద /సేవలు - చలామణిలో ఉండే కరెన్సీ నిష్పత్తి 

స్వల్ప మార్పుల వలన సైతం - ద్రవ్యోల్బణంలో పెను మార్పులు 

సంభవించే సహేతుక ప్రమాదముంటుందిఅందుకే ఆర్ధిక నిపుణులు 

ఎప్పటికప్పుడు మదింపులు వేస్తుంటారు 


కరెన్సీలో భాగమైన పెద్దనోట్ల చలామణి వలన

ఆర్థికాభివృద్ధికి ఆలంబనమే కాకుండా

అప్పుడప్పుడు ఆర్ధిక అవలక్షణాలకు సైతం కారణమౌతుంది

ఆటంక వాదం, నల్ల ధనం , టెర్రరిజం , రౌడీయిజం  పెచ్చరిల్లుతుంది.


పాలకుల ప్రభుత్వాలకే పలు సందర్భాలలో ప్రశ్నార్థకమౌతుంది

సమస్యలకు మూలమయ్యే పెద్ద నోట్ల రద్దు వలన

సమస్త ప్రజానీకం తాత్కాలికంగా  సతమౌతున్నా

సమ సమాజ స్థాపన కోరుకునే మనమంతా

సానుకూలంగా ప్రతిస్పందిస్తూ వారి ప్రయత్నాన్ని

సఫలత సాధనలో భాగస్వామ్యులమౌదాము

No comments:

Post a Comment