అంశం: నీవు లేకుంటే నేను ఎక్కడ
తేది: 29-10-2020
శీర్షిక :
సంఖ్య : 028
ప్రమిద దీపానికి
పవిత్ర ఇంధనం నేనైనా
పత్తి వత్తివి నీవై వెలుగులు
పంచుతున్నాము కలిసి మెలిసి....
బతుకు బండికి తోడు నీడగ
ఇరువైపుల నిలిచిన జోడెద్దుల్లా
ఇరుసున నిలిచిన జంట చక్రాల్లా
సంసార వాహనాన్ని సక్కంగ
లాగుతున్నాము....
నాకళ్ళతో నీకు ప్రపంచాన్ని చూపిస్తుంటే
నా మనసు నచ్చిన మెచ్చిన రుచులను పంచుతూ
బ్రతుకు జీవున్ని భద్రంగ చూసుకుంటూ
బహు పసందుగా ప్రసన్నం చేసుకుంటున్నాం ...
ఒకరికి ఒకరం తోడై
జీవిత చరమాంకంను
అలవోకగా గెలవాలనే తపనలతో
కలిసి కవాతు చేస్తున్న నాకు
నీవు లేకుంటే నేను ఎక్కడ?
No comments:
Post a Comment