అంశము: వైవిధ్య దృశ్యాలు
తేది: 16-10-2020
శీర్షిక: రాటుదేలిన రాజకీయం....
సా స సంఖ్య: 542
అక్కడంతా పెద్దమనుషులే
అందరూ గొప్ప అనుభవజ్ఞులే
జీవితాన్ని కాచి వడబోసినోళ్లే
అయినా మారని నైజం...
నీళ్లు నిద్ర నీడ మనది
పాడే పాటేమో మందిది
మన వీరులనొదిలి పెట్టి
పర మూర్ఖుల పాఠాలు ....
జనాభాలో సగమంటూ
బాధ్యతల బరువెత్తుడే
హక్కుల్లో మాత్రం చుక్కలు
చూపిస్తూ మీన మేషాల లెక్కింపు...
ప్రజాస్వామ్యం పేరుచెప్పి
వారసత్వం చేసుకోవడం
బక్క చిక్కినోడు వస్తే మాత్రం
అందరొక్కటి అయిపోవడం ...
అధికారంలో ఉన్నా
ప్రతిపక్షంలో ఉన్నా
అన్నీ సమంగ పంపకాలే
కాదంటే ఉండనే ఉంది
రచ్చ రచ్చ... రాజకీయం
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment