చైతన్య గేయము
తేది: 31-10-2020
శీర్షిక: ఢమరుకం
సంఖ్య : 552
ఎదురెళ్లి చెప్పవోయి
ఎలుగెత్తి చాటవోయి
యువతే మన భవితని
దేశానికి దిశా దశని. //ఎ//
ఎవరో వస్తారని
ఏదో చేస్తారని
ఆశించి భంగపడకు
అలవాటుగ మార్చుకోకు//ఎ//
స్వార్థాలను తెగనరికి
సమ సమాజ స్థాపనతో
అసమానత తుంచేసే
ఆయుధమై సాగుమా // ఎ //
అవినీతిని తరిమేసి
అంతర్గత అన్యాయం
అంతమొందించగ
అంకుశమై అవతరించు // ఎ //
పక్కలోన బల్లెంలా
పదే పదే కాలుదువ్వే
పొరుగు మూర్ఖుల
మట్టు పట్టే ఖడ్గానివైపో // ఎ //
రాజకీయమంటే రచ్చని
రోగం కుదరని రొచ్చని
దూరముంటే కాదని
అడుగేయి సోదరా //ఎ//
కష్టపడితే దక్కేది
వృధాగా పోదని
ఢంకాలు మోగించు
ఢమరుకమై నినదించు // ఎ //
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment