అంశము: జల దిగ్బంధనలో భాగ్యనగరం
తేది: 15-10-2020
శీర్షిక: చుట్టుముట్టిన ప్రళయం.
సా స సంఖ్య: 010
అందమైన హైద్రాబాదును
అలంకరించింది నేనంటే నేనని
గొప్పలు చెప్పుకునే గోత్రీకులు
జబ్బలు చరుచుకుంటారు....
విశ్వనగరమన్న విఖ్యాతిని
ఒక్క ఉదుటున ప్రశ్నించింది
చెట్టుకొకలు పుట్టకొకలాయిరి
చీకటి రాత్రిన చిందులేసిన వరదకు...
క్యుములో నింబసులో
అంబరమే చిల్లుపడిందో
నడిరేయి జడి వానలతో
నగరంలో నలిగిన జనం ....
బాధ్యత మరచిన పౌరులు
పాలన మరచిన నాయకులు
ప్రళికాలు మరచిన అధికారులు
అందరు కలిసిన అర్ధరాత్రి ఉసురు...
చెరువులన్నీ చెవిటివైపాయె
నాలాలన్నీ నీళ్లు నమిళనయి
మరుగైన మురుగే తిరగబడె
చుట్టుముట్టిన ప్రళయంతో
అందరి నోళ్ళు మూతబడె ....
నగునూరి రాజన్న
కరీంనగర్.
No comments:
Post a Comment