ముద్రలు
తేది: 26-10-2020
శీర్షిక: భక్తికి ముక్తికి...
సంఖ్య: 19
ముద్రలెంత నిగూఢమైనా
ముదితమే గద తెలియంగ
నాగరికతల నడకలలోన
నడయాడి విడిచిన నర్మ గర్భతలు ...
యుగం మారినా జగాన నిలిచిన
ప్రజా తంత్ర పాలనల పరిణతిలో
పరంధాముడే త్రేతాయుగమున
తరగని చెరగని ముద్రగ నిలిచే
పావనమై ప్రతి మదిన ఉత్కృష్టంగా....
కాలగమనములోన కరిగి
కదిలిపోయిన క్షణాల ఒరవడి
ఉలి పాఠవాల ఉత్కృష్టతలు
సంస్కృతి సంప్రదాయాల
గుడి గోపురాల శిల్పకళలు...
మనసున నిండిన భావముల
మౌనము దాల్చిన భంగిమలో
పాఠ్యములోనో నాట్యములోనో
" యోగ" ములోనో జ్ఞానమునకలు ...
జ్ఞాన ముద్రైనా చిన్మయ ముద్రైనా
కరమూలం మిదం జగత్
భక్తికైనా ముక్తికైనా ధ్యాన ముద్రేస్తే
ధన్యమే కద ఆరోగ్య జీవితానికి ....
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment