శ్రావణ భాద్రపదాలు
శ్రావణ మాసం అంటేనే సందళ్ళ మాసం
పండగలకు ప్రతీతి.
వర్ష ఋతువు ఏతెంచ దండి వానలు కురువంగ
పంచ భూతములన్ని పరవశించంగ
పచ్చ తివాచియై భూదేవి మెరువంగ
పంట పొలాలన్నీ పండంగ ఎదలన్నీ పొంగి నిండంగ.
రైతన్నే రాజైన చందంగ
సూక్ష్మ జీవుల దండయాత్ర
మెండని ఎంచిన పూర్వీకులు
పిల్లా పాపలు సల్లంగుండాలని
శుచి శుభ్రతలు పాటింపజేయ
దైవ కృపలను ఆపాదించి
ఆచార వ్యవహారాలను అందించె
మనకు మంచి మార్గదర్శకమ్ముగా.
బహిర్ స్నానాలు, వన భోజనాలు
బ్రతుకు ఆరోగ్యాన బహు మేలటంచు
ఎల్ల జనులు పాటించు భక్తి మీరగ నదీ స్నానములు,
భవ బంధముల మోక్షానికై భజియించి దర్శింతురు
భక్తి ప్రపత్తులతో భగవత్ సాన్నిధ్యములు.
సంతానార్ధులంతా సమ్మతించి కోరుదురు
సాగిలబడి కొలిచెదరు సాహో అని తలిచెదరు
పాలు, పండ్లు , గుడ్లు అర్పించి మొక్కెదరు
శ్రావణ శుద్ధ పంచమి రోజు నాగన్నకు -
నాగుల పంచమియై విలసిల్లగా .....
ఆడపడచులంతా చేరి ఆచరింతురు నోములు
అత్యంత భక్తి శ్రద్దలతో అమ్మవారి వ్రతములుగా
వరములిచ్చు తల్లిని వరలక్ష్మి వ్రతముగా
మాంగళ్య సౌభాగ్యాల మంగళగౌరీ పూజలుగా.
పడతులంతా జేరి పట్టువస్త్రములు ధరించి
పసుపు,కుంకుమ, పూలు,పండు తాంబూలాదులు
పాదముల పారాణి అంటి వాయనాలిచ్చుకుందురు
వరుసగాను ఘన శ్రావణమునందు.
అన్నదమ్ములపైన ఆత్మీయతలను
అక్కచెల్లెళ్లు చూపు అనురాగాలను
అజరామరమై నిలుపు ,ఆచంద్ర తారార్కముగా
వెలుగొందు ఆకాంక్షతో అక్కాచెల్లెళ్లు అన్నదమ్ములకు
అనురాగాల బంధముగ రక్ష కోరి కట్టేదే రక్షా బంధనం
ఈ శ్రావణమునందే......
యదుకుల భూషణుండు యశోదనందనుండు
గోపాల బాలుడు గోపికా వల్లభుడు
దేవకీ అష్టమ గర్భముగా జన్మించిన
వెన్న దొంగ చిన్ని కృష్ణుని శ్రీకృష్ణ జన్మాష్టమి
ఈ మాసమందే.
భాద్రపదమాసం
అంగ రంగ వైభవంగ
వీధి వీధి మలుపుల్లో
మండపాలు కట్టించి
అందమైన అలంకారాలతో
బాజా భజంత్రీలతో
తీరొక్క పూలు పత్రిలతో
అగ్రపూజలందుకునే
విజ్ఞరాజును కొలువు దీర్చి
నవరాత్రి ఉత్సవాలుగా
ఆకుల పూజలు,
కుంకుమ పూజలు ,
అన్నదానాలు
ప్రతి రోజు పూజలతో
పవిత్రమైన తీర్థ ప్రసాదాలతో
రోజుకో కథా కాలక్షేపంతో
భజియించి కొలిచెదరు
భక్తులంతా పాల్గొందురు
భాద్రపద మాసమ్మున.
No comments:
Post a Comment