Saturday, August 11, 2018

స్వదేశీ స్వదేశీ

అంశం : స్వదేశీ స్వదేశీ 
తేదీ :     09-08-2018
శీర్షిక : ఆర్ధిక ఎదుగుదల 


స్వదేశీ స్వదేశీ నినాదం 
నినాదాలతో సరదా పడితే సాకారం కాదు. 
విజ్ఞుల నుండి విలువైన సమాచారం   
వివరంగా కొంతైనా  తెలుసుకుంటే....  
ఇసుమంతైనా పాటిస్తే ...................   

వింతైన విష వలయంలో కొట్టుమిట్టాడే 
దేశ ఆర్ధిక చిక్కుముడులకు  
పరిష్కార మంత్రదండం
ప్రయత్నిస్తే పట్టుబడుతుంది. 

మనమంతా కొన్నా,తిన్నా కట్టే పన్ను 
దేశ సరిహద్దులు దాటుతుంటే 
పగటి వెలుగుల ప్రగతి  శూన్యమై 
కటిక చీకటి కాల రాత్రులే మిగుల్తాయి !

యుగాలనుండి 
సంస్కృతీ, సాంప్రదాయాలకు మూలం. 
విధానాలు, పద్ధతులకు పుట్టినిల్లు  
మన వేదాలు, ఉపనిషత్తులు.  
అనేక సంపదలకు ఆలవాలం  అయిన ఈ నేల
అందని ద్రాక్షలే జన సామాన్యుడికి . 

జనాభా పెరిగి, అవసరాలు పెరిగినట్టు 
ఆలోచనలకు అనుగుణమైన వస్తువు 
అనువైన ధరలో, అనుకున్న నాణ్యతతో 
అందుబాటు లేక అర్రులు చాచాల్సివస్తుంది.  
నాగరికత వ్యామోహంలో  
నవ యువత అయినది కానిది....  
టూత్ పేస్ట్ నుండి టు వీలర్ దాకా  
పరదేశీ అంటుంటే........ 
పరుగులు తీయదా సంపద.......  

అన్నీ ఉన్నా అల్లుని నోట్లో.... లాగ 
నాడు నైజాములు సంపద గల్ఫ్ బాట పట్టినట్టు  
నేటి నాయకుల, వ్యాపారుల ధన దాహం పెరిగి 
నిధులు పరదేశాల దారి పట్టి పతనమౌతుంటే  
పుట్టినూర్లో పెట్టుబడేది...... ?

అలాంటి చీకటి సందర్భాన్నే అధిగమించటానికి,
దేశ ఆర్ధిక గమన విధానాన్ని మార్చడానికి 
మన పాముల పర్తి వారు తీసుకున్న 
నిర్ణయం గ్లోబలైజేషన్ , లిబరలైజేషన్... 

పరాయి దేశపు  పెట్టుబడులతో
మనమంతా  కిరాయి మనుషులమై  
శ్రమ శక్తిని ధారబోసి, బ్రతుకు బాట తీర్చుకుని,  
మన ప్రాంగణ ఉత్పత్తులు, ఉత్పాదకతలు పెంచుకుంటూ...
స్వాతంత్య్ర సమరం నాటి సంఘటితాన్ని 
సానుకూలంగా సమర్థించి  
అనవసరాలను  అరికడుతూ  
అత్యవసరాలు, అవసరాలు 
మాత్రమే తీర్చుకుంటూ 
ఎగుమతులను  ప్రోత్సాహించి .
సమతుల్యతలు  పాటిస్తే.. ........ .
 
అధిగమించ వచ్చు సంధి సమయాన్ని
సాధించొచ్చు కొంతైనా....... 
పెంచవచ్చు మన ఫారెక్స్  ధన నిలువలు 
పంచవచ్చు ప్రతిఫలాలు పదుగురికి మన దేశాన 
ఆర్ధికంగా ఎదగవచ్చు విశ్వ వీధి గగనాన. 

No comments:

Post a Comment