స్వేచ్చా గీతం
భారత మాతకు వందనం
బంగారు నేలకు వందనం
దేశ భక్తిని చాటుదాం
సమైక్య గీతం పాడుదాం
మహానుభావుల కృషి పలితం
మన స్వేచ్చాయుత ఈ భారతం
సత్య,ధర్మ,అహింసల ఆయుధం
సర్వ మతాల సమతల నిలయం
చరిత్ర పుటలు తిరగేద్దాం
జరిగిన ఘటనలు తిలకిద్దాం
ప్రాంతీయత్వం వీడుదాం
భారతీయతను పెంపొందిధ్దాం
మంచి చేయదు మత తత్వం
మనుగడ కొరకు మానవత్వం
పెంపొంది ధ్దాం సౌభ్రాతృత్వం
అన్నదమ్ముల వలె ఐకమత్యం
విడనాడండి భాషాతత్వం
విశ్వసించండి జాతీయత్వం
వీర జవానులను కన్న దేశం
విభిన్నత్వములో ఏకత్వం
జీవనదుల గల పుణ్యదేశం
వేదం పలికిన ధర్మదేశం
బుద్ధ బోధనల పవిత్రదేశం
విశ్వ నిరతిని పొందిన దేశం
స్వార్థ చింతన మానుదాం
త్యాగనిరతిని చాటుదాం
సమైక్య గీతం పాడుదాం
భావి తరానికి సాగుదాం
నగునూరి రాజన్న
No comments:
Post a Comment