Saturday, August 11, 2018

ఆలోచన


11-08-2018

ఆత్మీయమైన కుటుంబం 
ఆప్యాయమైన సావాసాలు
అర్థవంతమైన బోధనలు  
ఆరోగ్యవంతమైన పరిసరాలు 
స్వచ్చమైన ఆలోచనలకు నాంది 

మనసు పాల సముద్రంమైతే  
మందర మేధో మధనం కావించి
గరళాన్నిగళమున దాచిన గంగాధరుని వలె 
అమృతపు ఆలోచన తరంగాలతో  
మానవ కళ్యాణం ఒడిసి పట్టుకోవచ్చు  

అనివార్యమైన సమస్యలకు 
అవిభాజ్య కుటుంబాల అండ దండలోలె 
సమూహపు ఆలోచనలనలెప్పుడు 
సమాజ దివిటీలై సదా ప్రకాశిస్తాయి. 

మనసుకు హత్తుకోలేని ఆలోచనలు
అనంత కోటి అయినా శూన్యమే. 
మంచి ఆలోచన ఒక్కటే అయినా 
మనిషి జీవితాన్నే మార్చగలదు.  

కుళ్ళు కలిగిన సమాజం చూసి 
ఒళ్ళు జలదరించుకోకుండా 
మన  గుండె నుండే మొదలవ్వాలి 
మంచిని పెంచి పోషించే ఆలోచన.
యత్ భావం తత్ భవతి.  

No comments:

Post a Comment