అంశం : ఆడపడుచులు
తేది : 25-08-2018
సంఖ్య : 40
ఆడపిల్లలెప్పుడూ ఆదిలక్ష్ములే
కూతర్లు ఎప్పుడూ కనకమహాలక్ష్ములే
కన్యాదానములో అల్లుడు
విష్ణుమూర్తి సమానుడైనందున......
ఆడపిల్ల ఉన్న ఇంటికి నిండు కళ
అమ్మా నాన్నల కంటి వెలుగు ఇల
అనురాగాలకు ఆత్మీయతలకు పుట్టిల్లు
అన్నదమ్ములకెపుడు ఆత్మ బంధువు నిలుచు
అమ్మలాంటి వెన్న మనుసుతో
నాన్నలాంటి గుండె ధైర్యం తో
మెట్టినింట గృహాలక్ష్మిగా అడుగిడినా
పుట్టినింటికి ఎప్పుడూ పెట్టని కోటే.
ఆడపిల్ల మనసు మల్లె తీగ సొగసు
అల్లుకు పోయే సరసు,
ఆడపిల్ల హృదయం
ఆనందాల అమృత భాండం
ఆత్మీయతల లోగిళ్ల పర్వం.
రక్షా బంధనాల రాఖీ పండుగలో
పుట్టినింటి ప్రతి ఉత్సవాలలో
నూతన గృహప్రవేశ మహోత్సవాలలో
అంతా తానై అధి దేవతగా నిలుచు.
ఆడపడుచుల ఆశీర్వాదం
కోటి జన్మల పూజా ఫలం
కొండెక్కని నిలువ దీపం
కోరికలు తీర్చు గండ దీపం.
నగునూరి రాజన్న
కరీంనగర్
(ప్రస్తుతం USA)
No comments:
Post a Comment