బాల్య మిత్రమా మన బంధం చూస్తుండగానే
ఒక జీవిత కాలం గడిచింది సుమా
ఉద్యోగాలు చేస్తూ ఊళ్లన్నీ తిరుగుతున్న నాకు
గుర్తుకొస్తున్నాయి మిత్రమా నీతో గడిపిన మధుర క్షణాలు
వర్షాల జోర్లతో చెరువు మత్తళ్లు దూకుతుంటే
మనమంతా ఆనందాల డోలికల్లో ఆడుకుని
బడి మాటే మరిచిపోయి నీటిలో గంతులేసిన రోజున
పంతులు గారితో తిన్న చింతబరిగెల బడితే పూజలు .
గుర్తుకొస్తున్నాయి మిత్రమా ఆనాటి మన చిలిపి చేష్టలు
కాలుష్యాల కబందాలు లేని మన పల్లెల్లో
కాలసూచీల టంచనులతో చెరువులన్నీ నిండితే
ప్రతీ ఏడూ నీవిచ్చిన ధైర్యంతో మనకు మనమే
పాత సొరకాయలు కట్టుకుని ఈతలు నేర్చుకున్నది
గుర్తుకొస్తున్నాయి మిత్రమా ఆనాటి మన కేరింతలు.
పొరుగూరికి కాలి నడకన బడికెళ్లిన రోజుల్లో
పోను రాను ముచ్చట్లతో పొద్దు గడిచిన తీరు
అయిదు మైళ్ళ దూరం అవలీలగా నడిచి
అన్న పానీయాలు మరచి ఆనందించిన రోజులు
గుర్తుకొస్తున్నాయి మిత్రమా ఆనాటి మధురమైన క్షాణాలు
హనుమంతుని గుడి గద్దెల మీద మనమంతా
కలిసి మెలిసి ఆదర బాదరాగా వ్రాసుకుని
కానిచ్చిన ఇంటిపని, చూచి వ్రాతలు నచ్చక
మన టీచర్లు కోప్పడ్డ సందర్భాలు
గుర్తుకొస్తున్నాయి మిత్రమా ఆనాటి మన అల్లర్లు .
పల్లెన ఉన్నప్పుడు ఊరంతా సోపతోల్లే
వాడ కట్టుకున్నోళ్లు కుల మతాలకతీతంగా
పంట చేన్లల్లో మనమంతా ఆడుకున్నప్పుడు
వావి వరుసలతో పిలుచుకున్న అనుబంధాలు .
గుర్తుకొస్తున్నాయి మిత్రమా ఆనాటి మన ఆత్మీయతలు.
వర్షములో తడిసి జడుసుకున్న నాకు జ్వరమొస్తే
అంజన్న బొట్టు తెచ్చి అన్నీ సర్దుకుంటాయని
అనునయించి భరోసా ఇచ్చినప్పుడు
సమ్మతమై ఆచరించిన సంతోష సమయాలు
గుర్తుకొస్తున్నాయి మిత్రమా ఆనాటి మన ఆపద సంపదలు.
వనభోజనాలకై వాగు దాటుతుండగా
వడి నీటి ప్రవాహంలో నేను పడిపోయినప్పుడు
ధైర్యంగా నా చొక్కా పట్టి లాగినప్పటి
సాదృశ్యమైన నీ చేతి చలువ స్పర్శ నాకింకా గుర్తు.
గుర్తుకొస్తున్నాయి మిత్రమా ఆనాటి నీ చేతి చలువలు.
పట్నం బ్రతుకుల బడి పిల్లలకు మనం
పంచుకున్న ఆరు బయటి ఆటల ఆనందాలు,
మనం ఆడిన గోలి కాయలు, చిర్ర గొనె,
కోతి కొమ్మచ్చి , కొండ వాగు ముచ్చట్లు.
మచ్చుకైనా కానరావంటూ గుర్తుకొస్తున్నాయి మిత్రమా ప్రతీ క్షణం
ప్రత్యక్షంగా గాని, పరోక్షంగాగాని
ప్రతి మిత్రునికి మంచి చేయక పోయినా
పరధ్యాన్నముగా కూడా చెడు అంటనీయని వాడే
పరమ శ్రేష్ఠ మిత్ర బంధానికి సంకేతం
తనువులు వేరైనా (తమస్సు)ఆత్మ ఒకటిగా నిలుస్తుంది.
బాల్య మిత్రులతో పంచుకున్న ఆనందాలు
బలమిచ్చి నిలుపుతాయి జీవితాన
బతుకుదెరువు బాటలో విడిపోయినా
బంగారు చలాకీని నింపుతాయి ప్రతీ క్షణాన.
నగునూరి రాజన్న
కరీంనగర్

No comments:
Post a Comment