పల్లె పారిపోయింది
మోట వచ్చి
గూడ యాతం మాయం.
మోటర్లొచ్చి
మోట...... మాయం.
చెరువులు కుంటలు
కుతంత్రాల గండ్లు
వాగులు,వంకలు ఏటి పాలయే...
ఏర్లన్నీ కలిపి నదుల పాలాయె
నదుల నీళ్లన్నీ పాలకుల పాలాయె
ఇగురం అర్థం కాని జనం ఇరుకున....
పంట ఎరువులతో
ఊర పిచ్చుక..... మాయం .
ట్రాక్టర్లు, హార్వెస్టర్లు వచ్చి
కాడెద్దులు...... మాయం.
కాడెద్దుల మాయం తో
వడ్ల కమ్మర్ల..... కనుమరుగు.
తలుగు,పగ్గం ఏసే మేదర్లు..... మాయం.
అప్పు సప్పులతో పైరు వేసినా
గిట్టుబాటు లేదాయె.
నకిలీ విత్తనాలు,ఎరువులతో
పంట దిగుబడే.... మాయం.
దుక్కి దున్నే జోడెద్దులు
కబేళాకు .... కదిలిపోయె.
సారమైన పంట పోలాలేమో
దళారీల..... పాలాయె.
కడకు .... కరువులతో
ఊరు, పల్లె .... పారిపోయె
పట్నములో.... కూలీలుగా
ప్రజలంతా మారిపోయే ... పల్లెమో ...... పారిపోయె..!
నగునూరి రాజన్న
కరీంనగర్
No comments:
Post a Comment