అంశం: శిరస్త్రాణం
కవిత సంఖ్య :34
తేదీ 18-08-2018
శీర్షిక : ఆరోప్రాణం
చిందర వందర ఆలోచనల దాగాలు
అఘ మేఘాల ప్రయాణ ఆరాటాలతో
ఎత్తు పల్లాల గుంతల దారుల గమనం
కాల నాగుల మూల మలుపులు
ఆశతో ఎదురుచూసే గుమ్మం మన గమ్యం
మనిషి మరలాగా సంచరిస్తున్నాడు
ఆకలి దప్పులు నిద్ర ప్రతీది కృత్రిమమే
ఇవి చాలవన్నట్టు రోడ్ల పక్కనే మందు మసాలాలు
ఆదమరిచి పయనిస్తే పక్కలో బల్లెమే
తప్పొప్పులు పక్కనపెట్టు మనమా ఎదుటివారా
పాలపుంతలనుండి గతి తప్పిన నక్షత్రాలవలె
వెనకనుండి ముందునుండి గందరగోళాలు
పిల్లులు మాటేసి కోడిపిల్లను కాజేసినట్టు
భరోసా లేని బ్రతుకులు రహదారి మలుపులు
ప్రతీ క్షణం ఆదమరిచి అడుగేయడమే శ్రేయం
వాహనాలపై నిత్యం ప్రయాణం
పద్మవ్యూహం చేరిన అభిమన్యుని చందం.
సర్వాంగానాం శిరస్సు ప్రథమం-శిరోకవచం ఆయుష్షుకు ప్రపూర్ణమ్
ఒక్క నిమిషం కేటాయించి శిరస్త్రాణం ధరిస్తే
మన పంచేంద్రియాలను పదిల పరిచి
పంచ ప్రాణాల ఎదురుచూపుల గమ్యం కల్లలు కాకుండా చేస్తుంది.
అందుకే శిరస్త్రాణం మానవునికి ఆరోప్రాణం .
No comments:
Post a Comment