Saturday, August 4, 2018

బ్రతుకు పాఠం 03--8-18 శీర్షిక : ఎదురీత

నగునూరి రాజన్న 
అంశం : బ్రతుకు పాఠం 
శీర్షిక : ఎదురీత
తేదీ 03--8-18

అపురూపంగా ప్రేమించే అమ్మానాన్నలు 
ఆత్మీయంగా అనునయించే కుటుంబసభ్యలు 
ఆరోగ్య పరంగా కానీ, అవసరాల పరంగా కానీ 
ఆటుపోట్లు  కానరానీయక  అలవోకగా సాగుతుంది 
ఆ జీవితం విద్యార్ధి దశ వరకు. 
అప్పుడప్పుడు హిత బోధ చేసినా  
అంటి ముట్టనట్టుండే సమస్యలపై  
అంతెలా చిక్కుతుంది  మనకు. 


ఉద్యోగాల మీద ఊర్లు మారితేనో 
బాధ్యతల బరువులతో అవసరాలు మారితేనో 
ఉన్నట్టుండి వచ్చే కుదుపులతో 
ఉలిక్కిపడతాము ఒక్కసారి మనమంతా. 
బ్రతుకు బడిలోనే కదా 
అనుభవాల పాఠాలు గడించేది 
మలుపుల ఆకలి కడుపే కదా 
విలువల పురోగమనానికి దారి 
కాలం తెరిచే ప్రతీ పేజి 
కాగలదు గొప్ప అనుభూతి 
అనుభవ పేజీల సారాంశమే 
అవుతుంది మన అడుగుల బాట 
రేపటి పేజీల నొసటి రాతలకు 
ఆలంబనాలై దారి చూపుతాయి. 
అమ్మా నాన్నలు ,కుటుంబ సభ్యులు 
అప్పుడప్పుడు చెప్పిన మాటల మర్మాలు
తెరలు తెరలుగా గుర్తొస్తుంటాయి . 

అవకాశాల ముసుగులో అనుసరించే స్నేహాలు 
ఆత్మీయత ముసుగులో  గుర్తొచ్చే బంధుత్వాలు
అనుపానులకై ఆరాటపడే కపటబాజీలు 
ఆర్థిక అవసరాలే అని అర్ధమయ్యే దాకా.... 
అడుగడుగున మన ఓటమికై ఆరాటపడే 
అక్కరకు రాని కుల, ప్రాంత ప్రాతిపదికలు, 
వివక్షల రాజకీయాలు, విలువ తెలియని మనుష్యులు 
పరోక్షంగా మన ఉన్నతికి అవరోధం అయినప్పుడు .... 

అదీ ఇదీ అనే తేడా లేకుండా 
ప్రతి చిన్న పెద్ద సంఘటనలతో 
అనునిత్యం పొందే అనుభవాల ప్రోదితో 
అడుగులు  ముందుకు వేస్తూ 
ముళ్ల లాంటి వారి ఛాయలను 
మళ్ళీ మన మార్గానికి ఆటంకం కాకుండా 
మైలు రాళ్లుగా మలుచుకుని 
బ్రతుకు పాఠంగా మార్చుకుని 
ఎంచుకున్న గమ్యంకై 
ఎదురీదుతూనే  ఉండాలి . 


No comments:

Post a Comment