08-08-2018
అంశం:విశ్వవిద్యాలయాలలో విద్యార్ధి యువత
శీర్షిక : మార్గదర్శి
ఆట పాటలతో ప్రాథమికమైనా
మామూలు శ్రద్ధతో మాధ్యమికమైనా
ప్రత్యేక శ్రద్ధతో పది పన్నెండు చేసినా
పరిణతి కలిగి పట్టా పుచ్చుకున్నా
విశ్వవిద్యాలయం చేరి యువత విశ్రమించగూడదు
అడుగడుగునా అడ్డంకులుండవచ్చు
ఆచార్యులు అందుబాటులో ఉండక పోవచ్చు
అవస్థలతో నీవు చదవాల్సి రావచ్చు
అచ్చయిన పుస్తకాలు దొరకక పోవచ్చు
అల్లర్లకు కేంద్రబిందువై ఉండవచ్చు
అదను చూసి కాటేసే అల్లరి మూకలుండవచ్చు
ఆచోటే ఉద్యమాలు పురుడు పోసుకోవచ్చు
ఆ ప్రాంగణమే విప్లవాలకు నీడ కావచ్చు
అలవికాని రాజకీయాలకు కేంద్రమవ్వచ్చు
అచ్చొసిన గూండాలకు ఆలవాలమవ్వచ్చు
అన్నింటిని దాటుకుని పట్టుదలగా
అజేయంగా నిలబడాలి క్రమశిక్షణగా
అకుంఠిత దీక్షతో నిర్విరామముగా
అమ్మా నాన్నల ఆశల దీపమై
అనుసరించి నడవాలి నీ బంగారు భవితకై.
ఆదరించక నిరాశ నిస్పృహల
అవలంబించు ఆచరణీయ పద్ధతిని,
ఆమోదయోగ్యమైన దారిలో పయనించి
అంకితమవ్వాలి దేశ సేవకై
ఆదర్శ మార్గదర్శివి కావాలి ముందు తరాలకు.
No comments:
Post a Comment