జానపద గేయం
తేది : 30-10-2021
శీర్షిక : ఉప ఎన్నిక
కవిత సంఖ్య : 787
వందలేండ్ల కష్టాలు
వదలపాయే ఈనాటికీ .....
శౌర్యాలకు పేరాయె
వీరులకు విలువాయె
నడుంకట్టి ఒక్కటాయే
పిక్కటిల్లే జనం నాడు .....
స్వార్థాలను చంకనేసుకుని
సదురుకున్న పెద్దోళ్ళు
నోరు మూసుకున్నందుకు
సమాధాయె... తెలంగాణా...
పడిన లేచిన కెరటంలా
మలివిడతన ముడిపెట్టి
పన్నెండేండ్ల కొట్లాటకు
ఫలితమైతే కనిపించే ....
పన్నెండొందల ప్రాణాలు
బలి పశువులు చేసిగానీ...
కదల్లేదు పాలకులు
వదల్లేదు పరపాలన ....
స్వాతంత్య్రపు వెలుగుల్లో
సమాధాన ప్రజాస్వామ్యం
సంతోషాల ఒడిలోన
పసిబిడ్డై పడినంతనే....
అత్తగారి పెత్తనానికి
అరిగోసల కోడలులా
వలసవాద పాలనలో
వట్టిపోయే పీఠభూమి.....
అంతా బాగుందిలే అనీ....
అశ్వాసన దొరకక ముందే
అప్పుల్లో కూరుకుని
తిప్పళ్లు పడుతుండే ....రాష్ట్ రం
ఉప ఎన్నిక ఒక్కటొచ్చి
ఉపద్రవం ముంచుకొచ్చే
గులాబీల చరిత్రలో
లుకలుకలు కానవచ్చే ......
ఉప ఎన్నిక చూడగానే
ఉడుకు రక్తమెగిసి పడే ....
ఓటుకు నోట్లాటలో ఆడోళ్ళు
రోడ్డెక్కి అరిచి గోలపెట్టవట్టె .....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment