దారి దీపాలు
తేది: 18-05-2022
శీర్షిక : శిఖర దీపకాంతులు
కవిత సంఖ్య : 904
స్వార్థాల కుబుసం విడిచి
సమస్తం సదా బాగుండాలనే
తపన చిత్తంతో జపం చేసే
మనసున్న మంచి మారాజులు .....
బడుగుల బలహీనుల పక్షమై
అన్యాయపు అడుగులను నిలువరించి
అక్రమాల గొంతుకలను ఎదిరించి
న్యాయ దేవతగా నడినెత్తిన బోనం
ఎత్తుకుని నడక సాగించే వారు ......
ఎదుటివారి కష్టాలకు చలించి
ఎగబడి సదా సాయాలు చేస్తూ .....
పక్కవారి నష్టాలను పరామర్శించి
నిత్యం నివారణల లేపనాలద్దేవారు .....
బంధు ప్రీతిని బందుకు జరిపి
తమ పర బేధములు ఎరుగక
స్థితప్రజ్ఞతల స్థిర చిత్తములతో
చిత్తగించే హృదయ పీఠం ఉన్నవాళ్లు .....
ఉత్తరాలకు ఊగిపోకుండా ...
దక్షిణలకు ఎగిరిపడకుండా ...
విజ్ఞానాల వెలుగుల విశ్వంలో
నిర్భయాల నిర్ణయాలకు నిలువెత్తు
సాక్ష్యాలయ్యే శిఖర దీపకాంతులు ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment