ప్రేమ గీతాలు
తేదీ 21-05-2022
శీర్షిక : తొలి ప్రేమ
కవిత సంఖ్య : 906
ఊహల్లో ఉదయించి
గుండెల్లో నిదురించి ....
కలలలోన తట్టి లేపి
పులకింతలు పెట్టావు ....
గాలిలోన ఈలవేసి
గానంలా మారినావు ....
సెలయేటి నీటిలోన
సరిగమలై పాడినావు ....
సుమముల పుప్పొడివై
పరిమళాలు వెదజల్లి ....
కమ్మని మాట కలిపి
కోయిల పాటయ్యావు ...
కనులలోన బింబమై
కదలాడుచుండగా ....
పెదవులేమో నీ పేరే
వల్లె వేయుచున్నవి ....
సుమధురాల సుందరమే
తొలిపరిచయ కావ్యము....
చెలి చూపుల చిక్కాలని
చేసే ప్రతి ప్రయత్నము .....
గుప్పెడంత గుండెలో
గూడు కట్టె ప్రేమంతా ...
ఏ రీతిగా వరసబెట్టి
ఎరుకపరుచ నేనిపుడు .....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment