ఆకుల మాటున
తేది: 07-06-2022
శీర్షిక : ఆడ పిల్ల
కవిత సంఖ్య : 137+3
ఆడపిల్ల పుట్టగానే ఆదిలక్ష్మని
అదృష్ట లక్ష్మని కొనియాడెదరు…
ఎదురుచూడని ఎదుగుదల కూడా
తోటకూర ఎదిగినట్టుంటుందంటారు ....
పిల్లలంటేనే ఆటపాటల అల్లరని
అల్లరి చిల్లరిగా అసలు కూడదని
అందునా ఆడపిల్లలు అణకువకు
మారుపేరుగుండాలని కోరు మనుజ లోకం...
పిల్లలెవరైనా కూడ పిసరంత స్వేచ్ఛనిచ్చి
గమన రీతులను ఓ కంట గమనిస్తూనే
స్వీయ క్రమశిక్షణలకు కొంత వెసులుబాటిచ్చి
అవసరమనుకున్న చోట ఆదుకోవడమే ...
అసలు సిసలైన ఆత్మీయత ...
ఆకు చాటు పిందెలా అపసోపాలు
ప్రదర్శించకుండా … ఆటవిడుపులా
స్వేచ్ఛలనిస్తూ … ఆత్మ నిర్భరతలను
అందిపుచ్చితే కద మల్లె తీగలై పరిమళించు….
అమ్మానాన్నలు కమ్మని స్వేచ్చ నిచ్చారని
కనులు రెండు మూసుకుని.. కానిపనులకు
కాలుదువ్వక... కన్నవారికి కట్టబెట్టరే
కీర్తిప్రతిష్టల కిరణ కాంతులను ఇలన మీరు...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment