తెల్లవారుజాము కల
తేది: 01-06-2022
శీర్షిక : గురువులు .....
కవిత సంఖ్య : 913.
కాయం కష్టాల కడలిలో
కాసింత సేద దీరాలని
కునుకుల రాజ్యం ఏలుదామని
కిట కిట తలుపులు వాలగానే .....
సప్త వర్ణాల ఇంద్ర ధనస్సులు
ఇష్టారాజ్యంగా వర్ణ చిత్రాలను
పేరుస్తూ ... ఆశల తలుపులు తట్టి
ఆశయాల గమ్యాలను చూపిస్తాయి ....
కళ్ళ ముందు కదిలిపోయిన చిత్రాలో ...
కాముక ఊహించుకునే కలల చిత్రాలో ....
ప్రియమైన అనుభూతులు కొన్నైతే
సుడిగుండాల గాలి దుమారాల ఇంకొన్ని ...
మంచి చెడుల మతలబులు కొన్ని ...
కష్ట సుఖాల కథల చిత్రాలు ఇంకొన్ని ...
మనోఫలకం చిన్నగ సేద దీరగానే
మేమున్నామంటూ పలకరిస్తాయి ....
పగటి కలలైనా సగటు కలలైనా
రాత్రిదైనా ....తెల్లవారుజాముదై నా
మేధోమథనాల మేరు పర్వతం
కొన్నిసార్లు గమ్యాలను సూచించి
గురువులై గగన విహారం చేస్తాయి ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment