చిత్ర కవిత
తేది: 27-05-2022
శీర్షిక : గాలి మేడలు
కవిత సంఖ్య : 129+8
ఆలు లేదు చూలు లేదు
కొడుకు పేరు గోవిందమని
ఎక్కడి గొంగడి అక్కడే ఉంచి
గొప్పలు చెప్పడమే వారి లక్ష్యం ...
ఆవలిస్తే ప్రేవులు లెక్కపెడుతూ
అమాయక చక్రవర్తులు కనక
అందుబాటులోకి వస్తే .. కంచికి
చేరని కథలన్నీచెప్పి వినిపిస్తారు ....
వింతగ వినేవారు దొరకాలే గాని
వీధి వీధి అంతా మనదేనంటూ
డంకా బజాయించి డాబాకొరకు
ప్రణాళికల రచనలు చేస్తుంటారు ....
మాటలతో మతలబులు చేసి
మూటలన్నీ సర్దేసుకుంటారు ....
సప్తవర్ణాల కర పత్రాలతో
సరంజామా లేకుండానే ఇల్లుకు
ముహూర్తం పెట్టి ముగ్గులు పోసేస్తారు .....
ఉచిత తాయిలాల ఊళ పెట్టి
స్వార్థ రాజకీయ ఎన్నికల
లాలూచీల
ప్రకటనలు నమ్మి
నట్టేట మునిగే దేశ ప్రజలులా ....
తాత్కాలికంగా తళుకులీనినా
శాశ్వతత్వం పొందలేని...గాలిలో
కట్టిన పేకమేడలు... ఎప్పటికైనా
పెళ పెళ కూలక మానవు ......
నగునూరి రాజన్న
No comments:
Post a Comment