పర్యావరణ గేయం
తేది: 04-06-2022
శీర్షిక : మారవయా ఓ మనిషి
కవిత సంఖ్య : 914
మారవయా ఓ మనిషి
మర్మమెరిగి జీవించు ...
జీవరాశి ప్రాణాలకు
పంచభూతమాధారం ..
భూమి నీరు ఆకాశం
అగ్నివాయువాదియూ .....
ప్రాణవాయువిచ్చేది
పచ్చని తరువులు ....
ఆకలి దప్పులు తీర్చి
ఆయువులు పెంచును .... //మార//
జలసాలు మానుకోని
అవసరాలు తీర్చుకో ....
స్వార్థాలను చంకదింపి
వ్యర్థాలను అరికట్టు ....
పాలిథీన్ల పనిపట్టు
స్వచ్ఛతకు సలాంకొట్టు
సూచనలు పాటించి
అలసత్వం జయించు.... //మార//
తొలకరితో కులకగనే
పులకింతలు ఆవనికి
గిలిగింతల ఆనందం
జీవరాశికంతటికీ .......
తరువే మన బంధువు
బరువని ఎంచకు
మొక్క నాటు చాలు
ముందుతరం మేలు //మార//
పచ్చ తివాచీలన్నీ
పరుచుకుంటే నిండుగా
మరకతమై శోభించు
ధరణి మాత మెండుగా
వాగు వంక చెట్టు గుట్ట
ప్రాణకోటి ఆయువులు
పట్టుబట్టి చెరబట్టకు
ప్రకృతి నియమాలను .... //మార//
నగునూరి రాజన్న
No comments:
Post a Comment