చిత్ర కవిత
తేది : 04-06-2022
శీర్షిక : శాలివాహనుడు
కవిత సంఖ్య : 137+1
మట్టిలో పుట్టి మట్టిలో పెరిగి
కూడు గుడ్డ నీడకు మట్టినే
నమ్ముకుని...మట్టితోనే అనుబంధం
పెనవేసుకున్న మానవుడు
బహు ముఖ ప్రజ్ఞాశాలి ....
అక్షరజ్ఞానాలు లేనినాడే
అకుంఠిత దీక్షలతో అపురూపాలు
సృష్టించాడు అరచేతితో ......
మేధకు పదును పెట్టి తాను
మేనుకు సౌకర్యంఅలరించ
నాగరికతల నీడల్లో నడయాడి
ఎవుసంలో మీసం తిప్పి ఆకలి
కేకలను మాయం చేసి....నేతలో
నాయకుడై... వస్త్రంతో ఆచ్చాదనలు
చేసుకుని ...చక్రం తిప్పి చక చక
పాత్రాలు చేసి వంటల వల్లభుడయ్యాడు .....
అంగవస్త్రం లేకున్నా...చమట చుక్కల
కష్టాల కడగండ్లను దాటుకుంటూ
బాధ్యతల బరువులు నెత్తికెత్తుకు ని
ప్రత్యేక జిగట మట్టిని పట్టి తెచ్చి
కుంకుమపువ్వులా మెత్తగా మార్చి
మట్టి ముద్దలతో మహత్యములు
సృష్టించాడు ....
అది ఇది అను తేడా లేదు ....
పైకప్పుకు పెంకులు ... వంటకు
పాత్రలు ... ధాన్య రాశులకు
గాజాలు... అతని చేతిలో కీలు
బొమ్మలు ... మానవ జీవనాన
మహత్తు కలిగిన మట్టి కుండలు
జీవం పోసుకుని మనకు జీవితాల
నిచ్చాయి ...
మట్టికుండల మాణిక్యమే కాదు
మహారాజుగా కూడా వెలుగొందాడు
శాలివాహనుడై క్షత్రియ ధర్మం
పాటించి పాలనలతో శకమునే సృష్టించి
చరితలో పేజీలు లిఖించి నిలిచాడు .....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment