భక్తి గేయం
తేది: 22-08-2020
శీర్షిక: ప్రజా క్షేమ కారకా...
సంఖ్య : 496
లంబోదరా విఘ్న రాజా
అంబా సుతా నాయకా
అమ్మ చేతి శిల్పమా
అజరామర రూపమా
అభయ హస్త భూషితా
ఆది పూజ్యా నాయకా //లంబో//
ఏకాక్షర గణపతి
లోకరక్ష నాయకా
వక్రతుండ మహాకాయ
ఏకదంత వినాయకా //లంబో//
అష్టాదశ విద్యల
అధిపతి మా రాజా
విఘ్నదేవ నాయకా
విశ్వ మోక్ష దారకా //లంబో//
ఆశ్రిత వరదుడా
ఆర్తజన పాలకా
హేరంబ గణపతి
లోకరక్ష నాయకా // లంబో//
అష్టసిద్ది గజాననా
అగణిత గుణధామ
పత్రి పూజ చేసినా
ప్రజా క్షేమ కారకా //లంబో//
కరినగరము.
No comments:
Post a Comment