ఈనాటి దృశ్యకవిసమ్మేళనం లో నా కవితా
శీర్షిక: పదమూడు ప్రత్యేకతలు ....
కవిత సంఖ్య : 463
ఒక్కటంటే ప్రథమమే అయినా
ముచ్చటైన మూడుతో కలిసిన
పదమూడుకున్న ప్రత్యేకతలను
పలుకరించి పల్లవించుకుందామా!
పశ్చిమాన పడని పదమూడంటె
పట్టువిడుపులే తూరుపు దేశాలలో
మెట్టుగా నిలిచి పుట్టిన రోజులాయె
గట్టిగా ఎందరో విశ్వ మేటి ప్రముఖులకు .....
సుఖదుఃఖాల సుందరం
కష్ట నష్టాల కమనీయం
నిష్టగా సాగుతున్న ఈ జీవనం
చిలిపి సమస్యలు... చిక్కు ప్రశ్నలే....
ఉదరపోషణలకు ఉనికి కలిగిన
ఆహారములోలె... మెదడుకు మేతలై
మేధో మధనానికి నాందీ పలికే
వింతైన చిక్కు ముడుల(puzzles day)
రోజుకూడా ఇదే .... అంతేకాదు...
మేటి ఘనుల సాహితీ సేవకుల
కూడిన నేటి కవితా సమూహపు
ద్వితీయ వార్షికోత్సవ పర్వమై
ద్విగుణ పరిచె నా ఆనందాలు ఈరోజె...
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment