వందేండ్ల ఉస్మానియా యూనివర్సిటీ
శీర్షిక: శత వసంతాల శాంగ్రీలా...
16-06-2020
శత వసంతాల శాంగ్రీలా...
చదువులమ్మ చల్లని ఒడి
మన ఉస్మానియా మహా బడి.....
ఉన్నత విద్యా సుగంధాలను
ఉచితంగా అందరికంటూ ఉడతా
భక్తిగా ఆంగ్ల ప్రభుత్వపు అయాచితం.....
ఏడవ నిజాము ఉస్మాన్ అలీఖాన్
హయాములో పురుడు పోసుకున్న
పూబంతి...
1919 లో భాగ్యనగరాన విరిసిన ముద్దబంతి
అద్దె భవనాల అరిష్టాలను దాటుకుని
ముచ్చటగా కొలువైనది పంతొమ్మిది వందల
హయాములో పురుడు పోసుకున్న
పూబంతి...
1919 లో భాగ్యనగరాన విరిసిన ముద్దబంతి
అద్దె భవనాల అరిష్టాలను దాటుకుని
ముచ్చటగా కొలువైనది పంతొమ్మిది వందల
ముప్పది తొమ్మిదిలో ప్రశస్త ప్రఖ్యాత ప్రస్తుత సౌ ధములో....
ఉర్దూతో ఊరేగించి ఉరుకు లంఘించినా
ఆంగ్లముతో అలరించి అల్లుకుని
అడుగులు వేసి తెలుగు వెలుగుల
సైతం తేట తెల్లముగా ప్రకాశిస్తుంది....
వైద్యాన్ని న్యాయాన్ని వరుస బెట్టి
శాస్త్ర సాంకేతికతలను సాధించుకుని
పలు విభాగాలు పదిలపరుచుకుంటూ
పల్లవించే పలు పరిశోధనల తోడ .....
వైద్యాన్ని న్యాయాన్ని వరుస బెట్టి
శాస్త్ర సాంకేతికతలను సాధించుకుని
పలు విభాగాలు పదిలపరుచుకుంటూ
పల్లవించే పలు పరిశోధనల తోడ .....
ఉరికే ఉద్యమాల పురిటిగడ్డ
ఉస్మానియా కాలేజీల అడ్డా
వందేమాతరమంటూ వంత పాడింది...
జనవాహిని మాటలకు జై భోలో
తెలంగాణమంటూ జేజేలు పలికింది...
ఉస్మానియా కాలేజీల అడ్డా
వందేమాతరమంటూ వంత పాడింది...
జనవాహిని మాటలకు జై భోలో
తెలంగాణమంటూ జేజేలు పలికింది...
కళలకు కాణాచి.... కావ్యాలకు నిలయం
ఉద్దండుల ఉనికికి ఊతమై నిలిచింది
అనన్య సామాన్యులకు అంకురమై
అందించింది పండితుల ప్రధాన మంత్రుల
పవిత్రంగ పరిమళించ మన దేశ చరిత్రన...
నగునూరి రాజన్న
కరినగరము
8332963129
No comments:
Post a Comment