పాలాభిషేకాలు
తేది:21-07-2020
శీర్షిక: ప్రసన్నాభిషేకాలు
సంఖ్య: 470
అనాదిగా మానవాతీతులను
ఆత్మీయంగా వేడుకుని
న్యాయ బద్ధంగా కోరుకుని
ధర్మ సమ్మతంగా ఆశించి....
పుణ్యం కోరుకునే పూజైనా
ఫలమాశించే వ్రతమైనా
పరమ పవిత్రంగ పాటించి
శుద్దంగా మనసు పెట్టి చేసి
శ్రద్దతో సంపూర్ణంగా ఆచరించేది ....
అనుకున్నదే తడవుగా తీరగానే
ఆనందాలకు ప్రతిఫలంగా .....
మానవమాత్రులుగా చేసేది
ఆత్మీయంగా సమర్పించే కానుకలు
గుళ్ళో దైవాలకు చేసే విశిష్ట సమర్పణం
అభిషేకాలు పూజలు హారతులు...
కాని ఈనాడు:
అసహాయుల పాలిట శూరులంటూ
అభయమిచ్చి కాపాడే రక్షకులంటూ
ప్రతిగా సమర్పించే పరిచర్యలు
పటాటోపాల ప్రదర్శనలు ప్రసన్నాభిషేకాలు
కృత్రిమ ప్రేమలు కుత్సితాశయాలు
దేవిడీలోని నాయకుడే అన్నీ
అంటూ.... మనిషి పూజలు
మాయ చేసే ఊడిగాలు .....
ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు....
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment