నగునూరి రాజన్న
అంశం: దృష్య కవిత
తేది : 24-08-2020
శీర్షిక: గురుమార్గం ....
సంఖ్య : 497
సెలయేటి నీటి ప్రవాహలై
సాగి పోవుచున్న నదీమతల్లులు
నేటి కవితా సమూహ వెలుగులైన
సాహితీ మిత్రులంతా.....
అలవోకగ అందరు కవితలు కథలు
గేయములు పండించె... కడు రమ్యంగా...
ఇంద్రుడు వరుణుడైన గురువులు
ఇల మనకు సహకరించ....
గురువుల సారథ్యములోన
గంభనంగా సాగిపోయే నావ...
గుర్తింపు అంశం మీరనగానే గుండె దడ
గుదిబండలా చిక్కు వీడదాయె....
అంశము ఐచ్చికమని సెలవియ్యగానే
అంత వీజిగ తెమలదాయె....
నల్లేరుపై సాగిన నడకల్లా...ఒక్కసారి
పల్లేర్లపై మోపిన పాదమాయె.....
అంధకార బంధులకు
గురుతరమైన గురుమార్గం
అజ్ఞాన తిమిరాలకు
దారిచూపే ఋజుమార్గం .....
గురుమార్గమే ఋజుమార్గం
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment